Begin typing your search above and press return to search.

మహేష్ పిలిస్తే వాళ్ళు వస్తారా ?

By:  Tupaki Desk   |   26 April 2019 3:39 PM IST
మహేష్ పిలిస్తే వాళ్ళు వస్తారా ?
X
వచ్చే నెల 1న జరగబోతున్న మహర్షి ప్రీ రిలీజ్ కు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇది మహేష్ కు ప్రతిష్టాత్మకైన 25 వ సినిమా కాబట్టి ఇప్పటిదాకా పనిచేసిన దర్శకులను ఒకేవేదికపైకి తీసుకొస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. చనిపోయిన కారణంగా బాబీ సినిమా దర్శకుడు శోభన్ ఒక్కరు రాలేరు కాని మిగిలిన వాళ్ళంతా అందుబాటులోనే ఉన్నారు. అయితే వాళ్ళలో ఎందరు వచ్చి తమ అనుభూతులను పంచుకుంటారు అనేది సందేహంగా ఉంది.

ఉదాహరణకు బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాల బయట కనిపించడం మానేశారు. ఏదో కొత్త సినిమా స్క్రిప్ట్ కోసం స్వంత ఊరికి వెళ్లారు అనే టాక్ ఉంది కాని ఆయన స్వయంగా ఇప్పటి దాకా ఏ విషయమూ చెప్పలేదు. ఇక జనగణమన తీయాలని ప్లాన్ చేసుకుని సైలెంట్ అయిపోయిన పూరి లాంటి దర్శకులు ఎప్పుడో ఫాం కోల్పోయిన జయంత్ సి పరాన్జీ లాంటి డైరెక్టర్స్ ని ఒప్పించడం ఈజీగా ఉండదు

సో మహేష్ 25 మూమెంట్ ని స్పెషల్ గా నిలపడానికి ఎందరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గుణశేఖర్ సైనికుడు లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. అతడు లాంటి క్లాసిక్ తీసిన త్రివిక్రమ్ ఖలేజా రూపంలో షాక్ తిన్నాడు. నాని తీసిన ఎస్జే సూర్య కనీసం తన సినిమా గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడు. ఇక స్పైడర్ మురుగదాస్ సంగతి సరేసరి.

పరిశ్రమలో సంబంధాలు జయాపజయాలకు అతీతంగా ఉన్నప్పటికీ స్టేజి పైకి వెళ్ళినప్పుడు మహేష్ తో అనుబంధం చెప్పాల్సి వచ్చినప్పుడు కలిసి చేసిన సినిమాల గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది. సో మహర్షికి ఎందరు దర్శకులు అటెండెన్స్ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది