Begin typing your search above and press return to search.

తిక్క పాప తెలుగు సీక్రెట్ తెలుసా

By:  Tupaki Desk   |   9 Aug 2016 9:23 AM GMT
తిక్క పాప తెలుగు సీక్రెట్ తెలుసా
X
బ్రెజిలియన్ భామ లారిస్సా బొనేసి తిక్క మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టేస్తోంది. వస్తూ వస్తూనే హిట్స్ తో ఊపుమీదన్న మెగాహీరోతో అరంగేట్రం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేసింది. అయితే.. లారిస్సా బొనేసి చాలా చోట్ల తెలుగు మాట్లాడేందుకు తెగ ట్రై చేసేస్తోంది. తక్కువగానే మాట్లాడుతున్నా.. మాట్లాడిన వరకూ ఈమె తెలుగు చక్కగానే ఉంది.

తిక్క భామ తెలుగు మాట్లాడ్డం వెనక చాలానే పెద్ద స్టోరీ ఉంది. ఐపీఎల్ యాడ్ లో ఈమెను చూసిన నిర్మాత రోహిణ్ రెడ్డి.. హీరో డైరెక్టర్లకు ఈమెను సూచించాడట. ఆ తర్వాత లారిస్సాను అప్రోచ్ అవడం.. సైన్ చేయడం.. సినిమా చేసేయడం.. ఇప్పుడు ప్రమోషన్స్ లో తెలుగు మాట్లాడేవరకూ స్టోరీ వచ్చేసింది. ఇలా లారిస్సాకి ఆఫర్ రాగానే.. వెంటనే మకాం హైద్రాబాద్ కి మార్చేసిన ఈ బ్రెజిలియన్ సుందరి.. స్పెషల్ గా ఓ తెలుగు ట్యూటర్ ని కూడా అపాయింట్ చేసేసుకుంది.

రూమ్ లో కూచుని పాఠాలు నేర్చుకోవడమే కాకుండా.. తన ట్యూటర్ తో కలిసి ఎంచక్కా కాఫీ షాపులు అవీ తిరిగేసి.. పబ్లిక్ లో తిరిగే సమయంలో అమ్మాయిల బిహేవియర్ ని లాంగ్వేజ్ ని కంఠస్తం చేసేసిందట. అలా ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసేసి.. ఇప్పుడు తెలుగు మాటలను గడగడా చెప్పేసే రేంజ్ కి చేరింది. అది సంగతి.