Begin typing your search above and press return to search.

తేజూ.. ఏంటీ అరాచకం?

By:  Tupaki Desk   |   17 Aug 2016 5:41 AM GMT
తేజూ.. ఏంటీ అరాచకం?
X
సాయిధరమ్ తేజ్ గత సినిమా ‘సుప్రీమ్’ పాజిటివ్ టాక్‌తో మొదలై.. సూపర్ హిట్టయింది. ఫుల్ రన్లో రూ.25 కోట్లు వసూలు చేసి సాయిధరమ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఐతే తేజు కొత్త సినిమా ‘తిక్క’ కేవలం మూడు రోజుల్లోనే 19.63 కోట్లు వసూలు చేసిందట. సాయిధరమ్ స్టామినాకు ఇది నిదర్శనమట. ఇలా చెబుతూ పోస్టర్లు వదిలారు. ఆ మధ్య ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రచారం విషయంలో ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. బోర్ సీన్స్ తీసేశాక సినిమా బాగా తయారైందంటూ ఒక చోట పోస్టర్లు వేయడం మహేష్ ఇమేజ్‌ ను డ్యామేజ్ చేసింది. అభిమానులకు మంట పుట్టించేలా చేసింది. యాంటీ ఫ్యాన్స్ కు అవకాశం దక్కేలా చేసింది.

ఇప్పుడు ‘తిక్క’ విషయంలో జరుగుతున్న ప్రచారం కూడా అలాంటిదే. పూర్తి నెగెటివ్ టాక్‌ తో మొదలైన ఈ సినిమాకు సరైన ఓపెనింగ్సే లేవు. తేజు వరుస హిట్లతో ఊపు మీదున్నా సరే.. ‘తిక్క’కు ఓపెనింగ్స్ అంత తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘తిక్క’కు ముందు రోజు విడుదలైన ‘బాబు బంగారం’కు కూడా నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ సినిమాకు కలెక్షన్లు బాగానే ఉన్నాయి. కానీ ‘తిక్క’ పరిస్థితే ఏమీ బాగాలేదు. మూడు రోజుల్లో రూ.4 కోట్ల దాకా ఈ సినిమా షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రాస్ ఆరేడు కోట్లు ఉండొచ్చేమో. దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి పది కోట్లు చెప్పుకున్నా ఓకే కానీ.. మరీ మూడు రోజుల్లో దాదాపు 20 కోట్లంటే నమ్మేదెవరు? మరి ఈ ప్రచారం నిర్మాతే చేస్తున్నాడా.. లేక డిస్ట్రిబ్యూటర్లే ఇలా హడావుడి చేస్తున్నారో తెలియదు కానీ.. ఇది సాయిధరమ్ కు మాత్రం ఏమాత్రం మేలు చేసేది కాదు.