Begin typing your search above and press return to search.
బడ్డింగ్ హీరోల థ్రిల్లర్ డ్రామాలు థియేటర్లకు రప్పిస్తాయా?
By: Tupaki Desk | 27 July 2021 4:54 AM GMT2020లో కరోనా మహమ్మారీ మొదటి వేవ్ అనంతరం సాయిధరమ్ నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` మొదటి సినిమాగా రిలీజై డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత ఇద్దరు బడ్డింగ్ హీరోలు నటించిన థ్రిల్లర్ సినిమాలు రిలీజవుతున్నాయి. టాలీవుడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఈ రెండిటి రిజల్ట్ ఏ తీరుగా ఉండనుంది. ఇంతకుముందులానే ప్రజలు థియేటర్లకు వస్తారా రారా? .. ఉత్కంఠగా వేచి చూస్తున్న క్షణమిది. ఇంతకీ బరిలో దిగుతున్న ఆ ఇద్దరు యువహీరోలు ఎవరు? అంటే..
సత్యదేవ్ వర్సెస్ తేజ సజ్జ...! కోర్టు డ్రామా థ్రిల్లర్ వర్సెస్ లవ్ డ్రామా థ్రిల్లర్...! కాంపిటీషన్ సాగనుందన్న టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాలు థ్రిల్లర్లే.. ఇద్దరూ బడ్డింగ్ హీరోలే.. ఇద్దరూ డీసెంట్ ఓపెనింగ్స్ కోసం కష్టపడాల్సిందే.. అయితే తిమ్మరుసు (సత్యదేవ్) ట్రైలర్ తదితర అంశాలు కారణంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అలానే మరోవైపున తేజ సజ్జ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజా చిత్రం ఇష్క్ తో విజయం అందుకోవాలన్న తపనతో హార్డ్ వర్క్ చేసాడు. జాంబీ రెడ్డితో అతడు విజయం అందుకుని తేజ సజ్జా రెట్టించిన ఉత్సాహంలో ఉండగా... ఓటీటీలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో సత్యదేవ్ మెప్పించి హుషారుగా ఉన్నాడు. ఈ నెలాఖరున రెండు సినిమాల రిజల్ట్ తేలనుంది.
మరోవైపు ఈ రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్లు బడ్డింగ్ హీరోయిన్లే. ఆ ఇద్దరికీ తెలుగులో పెద్ద ఐడెంటిటీ లేదు. ఇష్క్ లో తేజ సజ్జా సరసన నటించిన వింక్ గర్ల్ ప్రియా వారియర్ కి దేశం మొత్తం ఫ్యాన్స్ ఉన్నా ఆ ఫ్యాన్స్ ఈ బ్యూటీ ఇంకా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సియర్ గానే చూస్తున్నారు. మరోవైపున టాక్సీవాలా సినిమాతో క్రేజ్ తెచ్చుకుని ఆచితూచి అడుగులు వేస్తూ తనకు నచ్చిన కథనే ఎంచుకుంటూ మళ్లీ రెండేళ్ల గ్యాప్ తరువాత ఆడియెన్స్ ముందుకు వస్తోంది ప్రియాంక జవాల్కర్. ప్రమోషనల్ టీజర్ ట్రైలర్లలో ప్రియాంక ఆకట్టుకుంది. కానీ వీళ్లు ఈ సినిమాలకు ఎంత వరుకు ఉపయోగపడతారు అన్నది చూడాలి. కథ కంటెంట్ లో నాయికల పాత్రలకు ఉండే పరిధిని బట్టి వీళ్లకు గుర్తింపు దక్కుతుంది. ఇష్క్ చిత్రానికి ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతలు నిర్మించారు. కిరాక్ పార్టీ దర్శకుడు శరణ్ కొప్పివెట్టి తిమ్మరుసు చిత్రానికి దర్శకత్వం వహించారు. బడ్డింగ్ హీరోల థ్రిల్లర్ డ్రామాలు థియేటర్లకు రప్పిస్తాయా? లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.