Begin typing your search above and press return to search.
'కార్తికేయ 2' పై జనాల్లో ఆసక్తి రేపుతున్న అంశాలివే..!
By: Tupaki Desk | 2 Aug 2022 3:42 AM GMTటాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''కార్తికేయ 2''. ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' కు కొనసాగింపుగా ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
'కార్తికేయ 2' చిత్రాన్ని సూపర్ నేచురల్ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందించారని తెలుస్తోంది. కృష్ణుడి గాథ మరియు శ్రీకృష్ణ తత్వానికి సంబంధించిన అంశాల మిస్టరీ కథాంశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ విశేష స్పందన తెచ్చుకుని.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాపై సినీ అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించింది.
అయితే ఇది సీక్వెలా లేక ఫ్రాంఛైజీ మూవీనా అనే సందేహం చాలామందిలో ఉంది. ఎందుకంటే సాధారణంగా సీక్వెల్ అంటే మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచే రెండో పార్ట్ కథ ప్రారంభమవుతుంది.. అవే పాత్రలు కంటిన్యూ అవుతాయి. ఫ్రాంఛైజీ అంటే క్యారక్టరైజేషన్స్ ఒకేలా తీసుకుని కొత్త కథను తెరపై ఆవిష్కరిస్తారు.
'కార్తికేయ' సినిమా సీక్వెల్ అనడానికి అక్కడ నిఖిల్ ప్రేయసిగా కలర్స్ స్వాతి నటిస్తే.. ఇక్కడ 'కార్తికేయ 2' చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించింది. దీంతో స్వాతి పాత్రను ఈ సినిమాలో భాగం చేస్తారా లేదా? ఆమె రోల్ కు ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఫస్ట్ పార్ట్ లోని ప్రవీణ్ - తులసి - సత్య పాత్రలు ఇందులోనూ కొనసాగుతాయని అంటున్నారు కానీ.. ఇప్పటి వరకూ ప్రమోషనల్ కంటెంట్ లో వాళ్ళని చూపించలేదు. మరోవైపు అనుపమ తో పాటుగా అనుపమ్ ఖేర్ - శ్రీనివాసరెడ్డి - ఆదిత్యా మీనన్ - వైవా హర్ష వంటి కొత్త పాత్రలను 'కార్తికేయ 2' లో ప్రధానంగా చూపించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'కార్తికేయ 2' అనేది పర్ఫెక్ట్ సీక్వెల్ అనే విధంగా మాట్లాడారు. 'కార్తికేయ' లో ఒక సమస్యను పరిష్కరించి హీరో మెడికల్ డిగ్రీ తీసుకోవడంతో కథ ముగుస్తుందని.. ఆ తర్వాత మూడేళ్లకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో కార్తికేయ రెండో భాగం ప్రారంభం అవుతుందని తెలిపాడు.
అలానే స్వాతి పాత్ర ప్రస్తావన ఉంటుందని.. కథలో ఆ పాత్ర కూడా భాగమే అని కూడా నిఖిల్ చెప్పారు. అయితే 'కార్తికేయ 2' లో స్వాతి కనిపిస్తుందా లేదా అనేది సినిమా చూసే తెలుసుకోవాలని అంటున్నాడు. కథంతా ఉత్తరాదిన జరుగుతుందని.. అక్కడ హీరో కలిసే కొత్త అమ్మాయిగా అనుపమ కనిపిస్తుందని నిఖిల్ వెల్లడించాడు.
కాకపోతే కథలో స్వాతి క్యారక్టర్ ను ఎలా ఇన్వాల్స్ చేస్తారు? ఆమెతో లవ్ ట్రాక్ ని కట్ చేసి.. అనుపమ తో నిఖిల్ కు మధ్య ట్రాక్ ను ఎలా నడిపిస్తారు? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక 'కార్తికేయ' అనేది తెలుగుకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడు 'కార్తికేయ 2' మాత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.
తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫస్ట్ పార్ట్ ని చూపించకుండా రెండో భాగంతో మిగతా భాషల వారిని ఎలా కన్విన్స్ చేస్తారు? మొదటి భాగం చూడకపోయినా పార్ట్-2 అర్థమవుతుందా? అనే ప్రశ్న కూడా అందరి మదిలో మెదులుతోంది. ఇలా అనేక అంశాలు ఇప్పుడు 'కార్తికేయ' సీక్వెల్ కోసం అందరూ ఎదురు చూసేలా చేశాయి.
'కార్తికేయ 2' సినిమాపై నిఖిల్ ధీమాగా ఉన్నాడు. అందుకే 'మాచర్ల నియోజవర్గం' మరియు 'లాల్ సింగ్ చడ్డా' వంటి చిత్రాలకు పోటీగా రిలీజ్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మించచారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాత. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.