Begin typing your search above and press return to search.
ఆలోచించు శ్రీ విష్ణు
By: Tupaki Desk | 10 Nov 2019 4:39 AM GMTకొన్ని కథలు వినడానికి అద్భుతం గా ఉంటాయి. కానీ స్క్రీన్ మీదకి వచ్చే సరికి బెడిసి కొడతాయి. సరిగ్గా ఇప్పుడు శ్రీ విష్ణు సినిమాల తీరు అలాగే ఉంది. సినిమా సినిమా కు డిఫరెంట్ కథను ఎంచుకుంటూ హీరోగా మంచి రెస్పెక్ట్ తెచ్చు కుంటున్న సమయం లో రాంగ్ స్టెప్ వేసి కెరీర్ ని డౌన్ చేసుకుంటున్నాడు.
'అప్పట్లో ఒకడుండేవాడు' , 'నీది నాది ఒకే కథ' లాంటి సినిమాల తో కమర్షియల్ గా భారీ హిట్స్ అందుకో లేకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 'మెంటల్ మదిలో' తో కూడా పరవా లేదనిపించుకున్నాడు. కానీ ఆ తరువాత 'వీర భోగ వసంత రాయులు' అనే సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా చూసిన వారు శ్రీ విష్ణు ఇలాంటి క్యారెక్టర్ తో ఇంత చెత్త సినిమా ఎలా చేశాడా అనుకున్నారు. కట్ చేస్తే 'బ్రోచేవారేవారురా' తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడనుకుంటే మరో సినిమాతో అదే తప్పు రిపీట్ చేసాడు.
'తిప్ప రా మీసం' తో ప్రేక్షకులకు బోర్ కొట్టించి విసుగు తెప్పించాడు. నిజాని కి శ్రీ విష్ణు నుండి మరో డిఫరెంట్ సినిమా వస్తుందని భావించి థియేటర్స్ కెళ్లిన ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచి నీరసం తెప్పించాడు. కథ , క్యారెక్టర్ వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద కి వచ్చే సరి కి తేడా కొట్టాయి. సో ఇకపై అయినా శ్రీ విష్ణు ఇలాంటి కథలకు ముందే ఎగ్జైట్ అవ్వకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కెరీర్ బాగుంటుంది. లేదంటే కెరీర్ ను దెబ్బ తీసుకోవడం ఖాయం.