Begin typing your search above and press return to search.
పిక్ టాక్: మాస్ అవతారాల్లో 'పుష్పరాజ్ - శ్రీవల్లి'ల ఊర మాస్ స్టెప్పులు..!
By: Tupaki Desk | 26 Oct 2021 6:46 AM GMTఅల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
'పుష్ప'' చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ అవతారంలో.. 'తగ్గేదే లే' అంటూ సరికొత్త మేనరిజంతో బన్నీ అలరించనున్నారు. ఇక హీరోయిన్ రష్మిక మందన్న ఇందులో శ్రీవల్లి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇద్దరూ డీ గ్లామర్ లుక్స్ లో ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - రెండు పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఈ క్రమంలో ''సామీ సామీ'' అనే మరో పాట లిరికల్ వీడియోని మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ‘నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. నా సామీ’ అంటూ ఐదు భాషల్లో వచ్చిన మాస్ ప్రోమో అలరించింది. పూర్తి పాటను తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 28న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు.
మరో రెండు రోజుల్లో మాస్ ఫెస్టివల్ మొదలు కానుందని పేర్కొంటూ మేకర్స్ తాజాగా 'సామీ సామీ' పాటలోని మరో స్టిల్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఒకరికొకరు చూసుకుంటున్న అల్లు అర్జున్ - రష్మిక మందన్న.. మాస్ గెటప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా ఇద్దరూ గ్రీన్ - రెడ్ కలర్ కాంబినేషన్ కాస్ట్యూమ్స్ లో దర్శనమిచ్చారు. బన్నీ పంచె కట్టుతో మెడ మీద కర్చీఫ్ వేసుకొని ఒక మొరటు వ్యక్తిని గుర్తు చేస్తున్నారు.
'సామీ సామీ' ప్రోమో మరియు సరికొత్త పోస్టర్ ని బట్టి చూస్తే.. ఈ పాట 'టాప్ లేచిపోద్ది' 'సినిమా చూపిస్తా మామా' లకు మించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో డ్యాన్సులు కూడా ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. పుష్పరాజ్ గురించి శ్రీవల్లి పాడుకునే ఈఈ పాట వెనక కథేమిటో తెలియాలంటే ‘పుష్ప’ విడుదల వరకూ ఆగాల్సిందే.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా.. సింగర్ మౌనిక యాదవ్ ఈ గీతాన్ని ఆలపించారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ''పుష్ప'' సినిమాని నిర్మిస్తున్నారు.