Begin typing your search above and press return to search.
ఈ నటుడు పేరుకే విలన్.. చేతలు మాత్రం హీరోవే!
By: Tupaki Desk | 17 Sep 2022 9:30 AM GMTసినిమా నటులను చూసి చాలామంది పొరపడుతుంటారు. ముఖ్యంగా విలన్ పాత్రలు వేసేవారు నిజ జీవితంలోనూ అంతే కర్కోటకంగా, క్రూరంగా, జాలి, దయ లేకుండా ఉంటారనే అపోహలు ఉన్నాయి. అయితే అది సినిమా, వాళ్లు పోషించే పాత్ర మాత్రమే. చాలామంది విలన్లు సినిమాల్లో ఉన్నంత కర్కశంగా ఉండరు. వారిలోనూ వెన్నలాంటి మనసు ఉన్నవారు ఉన్నారు.
గతంలో సూర్యకాంతం, ఎస్వీ రంగారావు లాంటివారు.. ప్రస్తుత తరంలో సోనూ సూద్ లాంటివారు తాము సినిమాల్లో విలన్లమయినా.. నిజ జీవితంలో మాత్రం హీరోలను మించినవారిమని నిరూపించారు. ఇప్పుడు ఈ కోవలో ప్రఖ్యాత నటుడు రావు గోపాలరావు కుమారుడు, తండ్రిని మించిన తనయుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న రావు రమేష్ కూడా నిలుస్తున్నారు.
ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన నటనతో అలరిస్తున్నారు.. రావు రమేష్. ఇప్పుడు చేసిన పని అందరి అభిమానానికి కారణమవుతోంది. తనకు మేకప్ మ్యాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మరణిస్తే ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. స్వయంగా ఆ మేకప్ మ్యాన్ ఇంటికెళ్లి.. ఆ కుటుంబానికి రూ.10 లక్షలు చెక్ అందించాడు. ఏ అవసరమున్నా తనను కలవాలని.. ఆ కుటుంబానికి రావు రమేష్ భరోసా ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఈ విషయం తెలియడంతో నెటిజన్లు రావు రమేష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోనూ సూద్ మాదిరిగానే మీరు కూడా గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని రావు రమేష్‌ను కొనియాడుతున్నారు. అవసరం తీరిపోయాక మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న ఈ రోజుల్లో తనకు మేకప్ వేసిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకోవడం చాలా గొప్ప విషయమంటున్నారు.
అప్పట్లో రావు రమేష్ తండ్రి రావు గోపాలరావు కూడా వందలాది చిత్రాల్లో నటించారు. రాజనాల, నాగభూషణం మరణించాక తెలుగు తెరకు గొప్ప విలనీని చూపించిన అద్భుతమైన నటుడు.. రావు గోపాలరావు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన రావు గోపాలరావు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.
అలాగే తన దగ్గర పనిచేసే మనుషుల్ని అంతే ఆప్యాయంగా చూసుకునేవారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సైతం రావు గోపాలరావు ఎంత మంచి వ్యక్తో పలు సందర్బాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి కోవలోనే కుమారుడు రావు రమేష్ నడుస్తుండటం అభినందించదగ్గ విషయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.