Begin typing your search above and press return to search.

ఇది బంగారు చేపా.. బూరెబుగ్గల పాపా..!!

By:  Tupaki Desk   |   28 Dec 2020 11:30 AM GMT
ఇది బంగారు చేపా.. బూరెబుగ్గల పాపా..!!
X
టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ రాశిఖన్నా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మొదటి నుండి తన అందం, అభినయంతో కుర్రకారు దోచుకుంటూనే ఉందీ ఢిల్లీ భామ. తొలి సినిమా ఊహలు గుసగుసలాడే మూవీతోనే తెలుగులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మద్రాస్ కేఫ్ సినిమాతో మొదటగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ పై అలా ఊహలు పెంచుకుంటూ వచ్చిన రాశి.. తన అందాలను బెంగాల్ టైగర్ సినిమాతో రాసులుగా గుప్పించడం మొదలు పెట్టింది. ఇక అప్పటి నుండి వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. కెరీర్ లో ఇప్పటి వరకు జిల్, తొలిప్రేమ, జైలవకుశ లాంటి హిట్ సినిమాలను తన అందాల ఖాతాలో వేసుకుంది. ఆ మధ్యలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం పెద్దగా ఆడకపోవడంతో కెరీర్ డైలమాలో పడింది. గతేడాది విడుదలైన వెంకిమామ మూవీతో డీసెంట్ హిట్ అందుకుంది రాశి.

2018లో ఇమైక నొడిగళ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ భామ. ఆ సినిమా మంచి విజయం సాధించి రాశికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది ఈ అమ్మడు. మొన్నటి వరకు లాక్‌డౌన్ సమయాన్ని రాశి బాగా ఉపయోగించుకుందట. ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల తర్వాత రాశి తెలుగు ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఓకే చేసినట్లు లేదు. అందుకే అమ్మడి చేతిలో ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. అరణ్మనై-3, మేధావి, తుగ్లక్ దర్బార్, సైతాన్ క బచ్చాలను వరుసగా లైన్ లో పెట్టింది రాశి. చూస్తుంటే 2021లో అసలు ఖాళీగా ఉండేలా లేదే. ఇదంతా పక్కన పెడితే రాశి తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రాశిని చూస్తూ గ్లామర్ ప్రియులు కళ్ళప్పగించేసారు. అంతలా ఆకట్టుకుంటోంది బంగారం కలర్ డ్రెస్ లో రాశి అందం. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా రాశి ఈసారి అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం చేపల పోలుసులు డిజైన్ పొదిగిన ఆ డ్రెస్ లో రాశి దేవతలా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.