Begin typing your search above and press return to search.

ఈ సీరియస్ బ్యూటీ 48 గంటలు నాన్ స్టాప్ గా నిద్రపోగలదట

By:  Tupaki Desk   |   22 Aug 2021 5:15 AM GMT
ఈ సీరియస్ బ్యూటీ 48 గంటలు నాన్ స్టాప్ గా నిద్రపోగలదట
X
హీరోయిన అన్నంతనే అందంగా ఉండటం కామన్. కాకుంటే కొందరు కలుపుగోలుగా ఉంటే.. మరికొందరు జోవియల్ గా ఉంటారు. మరికొందరు అమాయకంగా.. ఎలా బతుకుతుందో అన్నట్లు ఉండే వారు లేకపోలేదు. మరికొందరు టఫ్ గానూ కనిపిస్తారు. వీరందరికి కాస్త భిన్నంగా సీరియస్ గా కనిపించే బ్యూటీ ఒకరున్నారు. తనే.. నివేదా పేతురాజ్. తెలుగు.. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు.. అన్ని సీరియస్ క్యారెక్టర్లను చేయటంతో.. సీరియస్ బ్యూటీ అనే పేరు వచ్చేసింది.

తనను అందరూ సీరియస్ గా ఉంటారని చెబుతారని.. కానీ తాను చాలా జోవియల్ అంటుంది. కానీ.. అమ్మడి ముఖం చూసినా.. ఆమె తీరు చూసినా.. తెర మీద ఆమె పోషించే పాత్రలు చూసినా.. అన్ని సీరియస్ గా ఉండటంతో.. అందరూ ఆమెను సీరియస్ పీస్ కిందనే కౌంట్ చేస్తారు. తనకొచ్చిన సీరియస్ ఇమేజ్ కు.. తన వ్యక్తిగతానికి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేస్తున్నా.. ఆమె ఇమేజ్ మాత్రం మారట్లేదు. పుట్టింది తమిళనాడులో అయినా పెరిగింది మాత్రం దుబాయ్ లోనే. చిన్నతనంలోనే దుబాయ కు వెళ్లిపోవటంతో అక్కడే ఆమె పెరిగి పెద్దయ్యారు.

తనను తాను చాలా సరదా మనిషిగా చెప్పుకునే నివేద ఇష్టాయిష్టాల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. నటి కాకుంటే అయితే ఫిట్ నెస్ కోచ్ కానీ.. యోగా ఇన్ స్ట్రక్టర్ అయ్యేదానినని చెబుతారు. బట్టల కోసం అతిగా ఖర్చు చేయటం అస్సలు ఇష్టపడని ఈ బ్యూటికి సింఫుల్ గా ఉండే వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్ ను ఇష్టపడతానని చెబుతుంది. పండగలప్పుడు మాత్రం చీరల్ని ఇష్టపడతానని చెప్పే నివేదాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఇష్టంగా జపనీస్ వంటకమైన సూషి బాగా నచ్చుతుందని.. పాతకాలం నాటి అపురూప వస్తువులుఏం కనిపించినా సరే వెంటనే కొనేయాలనిపించటం ఆమెకున్న బలహీనతల్లో ఒకటిగా చెబుతారు.

నిజానికి సెలబ్రిటీల్లో చాలా మందిలోకనిపించని ఒక విచిత్రమైన క్వాలిటీ నివేదా సొంతం. సెలబ్రిటీలు.. ప్రముఖులకు నిద్ర అంటే చాలా కష్టంగా వస్తుందని చెబుతారు. అందుకు భిన్నంగా ఈసీరియస్ బ్యూటీ తీరు ఉంటుంది. ఆమె గురించి ఎవరికి తెలీని సీక్రెట్ ఏమంటే.. అవకాశం ఇవ్వాలే కానీ నాన్ స్టాప్ గా 48 గంటలు కూడా పడుకోగల సత్తా ఆమె సొంతమంట. తన స్లీపింగ్ సీక్రెట్ ఎవరికి తెలీదని చెబుతుంది. మిగిలినవన్నీఎలా ఉన్నా.. నిద్ర విషయంలో మాత్రం ఆమె చాలా.. చాలా లక్కీ ఫెలో అని చెప్పక తప్పదు.