Begin typing your search above and press return to search.

బైక్ యాడ్ కోసం సాహో స్టార్

By:  Tupaki Desk   |   17 Nov 2018 8:41 AM GMT
బైక్ యాడ్ కోసం సాహో స్టార్
X
బాహుబలి' ఘనవిజయంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీప్రియులు ప్రభాస్ నెక్స్ట్ సినిమాకోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రమైన 'సాహో' ను సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా నుండి 'షేడ్స్ ఆఫ్ సాహో-చాప్టర్ 1' అంటూ మేకర్స్ ఒక మేకింగ్ వీడియో టీజర్ ను కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేశారు.

షేడ్స్ ఆఫ్ సాహో సోషల్ మీడియాలో ఇప్పటికీ భారీ వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ ఓ కాస్ట్లీ స్పోర్ట్స్ బైకుపై రివ్వున దూసుకుపోయే షాట్ ఉంది. స్టైలిష్ జాకెట్.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి ఆ బైకును నడపడం.. మధ్యలో జాకెట్ ను పక్కకు అనడం.. అంతా హాలీవుడ్ యాక్షన్ హీరో స్టయిల్ లో ఉంది. ఇక ఈ షేడ్స్ ఆఫ్ సాహో రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రముఖ బైక్ కంపెనీ బ్రాండ్ ఎండార్స్ మెంట్ కోసం ప్రభాస్ ను సంప్రదించిందట. డీల్ కుదుర్చుకునేందుకు భారీ మొత్తంలో అమౌంట్ ఆఫర్ చేశారట. ప్రభాస్ కూడా ఈ డీల్ విషయంలో ఆసక్తిగానే ఉన్నాడని.. త్వరలో ఈ డీల్ ఫైనలైజ్ అవుతుందని టాక్.

ఈ ఒక్క బైక్ కంపెనీ మాత్రమే కాదు.. ప్రభాస్ స్టార్డం ను గుర్తించిన ఇతర కార్పోరేట్ సంస్థలు బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్రభాస్ ను తీసుకునే ఆలోచనల్లో ఉన్నాయట. ఒకవేళ 'సాహో' హిట్ అయితే అందరూ ప్రభాస్ వెంటబడతారేమో. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' తో పాటుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.