Begin typing your search above and press return to search.
ఈ డైరెక్టర్ డిఫరెంట్ గురూ! ఎందుకంటే?
By: Tupaki Desk | 16 Dec 2022 10:30 AM GMTహిట్ సినిమాకి సీక్వెల్ చేయాలనుకుంటే చేయోచ్చు. అది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. పేరుకే సీక్వెల్ తప్ప! అది ప్రెష్ కథతో తెరకెక్కినా..దానికి హిట్ సినిమా సీక్వెల్ అంటూ మార్కెట్ చేసేస్తున్నారు. అలా సీక్వెల్ రూపం ఇటీవల పూర్తిగా మారిపోతుంది. ఇక సీక్వెల్ కథ రాసుకునే సమయంలో ఫలానా హీరో అయితే బాగుంటుందని దర్శకుడికి రఫ్ గా ఓ ఐడియా ఉంటుంది.
దాన్ని బేస్ చేసుకుని కొంత వరకూ కథని అల్లుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి విధానం కొంత మంది అనుసరిస్తే....ఎలాంటి ఆలోచన లేకుండా వెళ్లే క్రియేటివ్ ఫెలోస్ మరికొంత మంది. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వీళ్లందరికీ డిఫరెంట్. ఇతను ఏకంగా ఒకే సీక్వెల్ లో ఇద్దరు హీరోలకు..వేర్వేరుగా కథలు సిద్దం చేస్తున్నాడుట. దీన్ని కొత్త పోకడగానే చెప్పాలి.
మరి సేఫ్ సైడ్ గా ఒకేసారి రెండు కథలు రాయిస్తున్నాడా? లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా? అన్నది అతనికే తెలియాలి. ఇంతకీ ఎవరా ఘనాపాటి అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ లో వినోదాలు పంచిన సిరీస్ ల్లో 'హెరాఫెరీ' ఒకటి అన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సినిమాకి సీక్వెల్ గా పార్ట్ -3ని సన్నాహాలు చేస్తున్నారు ఫిరుజ్ నడియావాలా.
కానీ ఇందులో హీరో ఎవరు? అన్నది క్లారిటీ లేదు. అక్షయ్ కుమార్..కార్తీక్ ఆర్యన్ లు అయితే బాగుంటుందని భావిస్తున్నా రుట. కానీ ఏ ఒక్కర్నీ ఇంకా ఫైనల్ చేయలేదు. అందుకోసం ఫిరోజ్ కి వినూత్నమైన ఐడియా వచ్చింది. ఇద్దరి కోసం ఈ సీక్వెల్ కథ సిద్దం చేద్దాం. ఇద్దరి ఇమేజ్ లకి తగ్గట్లు రెండు రకాల కథలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రెండు రకాల టీమ్ ల్ని నియమించి ఆ ప్రాజెక్ట్ లపై పనిచేయమని ఆదేశాలిచ్చారుట. ఇతనేమి తెలివి తక్కువ వాడు కాదు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న చందంగా రెండు కథలు రెడీ చేసి రెండిటిని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. సీక్వెల్ అంటే ఒక హీరోతోనే చేయాలా? ఇద్దరి హీరోలతో చేయకూడదా? చేసి చూపిస్తాను అన్న నమ్మకంలో ఫిరోజ్ నడియావాలా కనిపిస్తున్నాడు. రెండు వేటికవి డిఫరెంట్ గా ఉంటే? రెండు పనికొచ్చే కథలే కదా. లేకపొతే రెండింటిలో ఒకటి బెస్ట్ ఛాయిస్ గా ఎంపిక చేయోచ్చు అన్నది నడియావాలా ప్లాన్ అయిండొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.