Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ కు 10.59 కోట్లు బకాయిపడ్డ తండ్రి

By:  Tupaki Desk   |   1 May 2019 12:12 PM GMT
హీరోయిన్‌ కు 10.59 కోట్లు బకాయిపడ్డ తండ్రి
X
ఆయన ఒకప్పటి స్టార్ హీరో. ఆయన వారసత్వాన్నందుకుని కూతురు హీరోయిన్ అయింది. ఇప్పుడు తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు. కూతురు సంపాదన ఆరంభించాక తండ్రికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఏకంగా 10.59 కోట్లు కూతురు తండ్రికి ఇవ్వడం.. ఆ మొత్తాన్ని తన అప్పుల్లో భాగంగా తండ్రి ఎన్నికల అఫిడవిట్లో చూపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒకప్పటి బాలీవుడ్ స్టార్, ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌ గా ఉన్న శత్రుఘ్న సిన్హా విషయంలో ఈ చిత్రం చోటు చేసుకుంది. ఆయన తనయురాలు సోనాక్షి సిన్హా దాదాపు దశాబ్ద కాలంగా కథానాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె నుంచి తాను 10.59 కోట్లు అప్పు తీసుకున్నట్లు శత్రుఘ్నసిన్హా నామినేషన్ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్న శత్రుఘ్న.. ఆ పార్టీతో విభేదించి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ టికెట్ మీద పట్నా సాహిబ్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. భాజపాలో కీలక నేత, మంత్రి కూడా అయిన రవిశంకర్ ప్రసాద్‌ ను ఆయన ఢీకొంటుండటం విశేషం. నామినేషన్ దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలను శత్రుఘ్న అఫిడవిట్లో వెల్లడించారు. తనకు రూ.112 కోట్ల దాకా ఆస్తులున్నట్లు అందులో పేర్కొన్నారు. స్థిరాస్తులు 103.61 కోట్లు కాగా.. చర ఆస్తులుు రూ.8.60 కోట్లు 2.74 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు.. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్‌ లో రూ.29.10 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. రూ.1.03 కోట్ల విలువైన బంగారం, ఇతర ఆభరాణాలున్నట్లు పేర్కొన్న శత్రుఘ్న.. తనకు వివిధ రకాలైన ఏడు కార్లు ఉన్నట్లు కూడా తెలిపారు. పట్నా సాహిబ్ స్థానానికి చివరి దశలో మే 19న ఎన్నికలు జరగనున్నాయి.