Begin typing your search above and press return to search.
శాండిల్ వుడ్ కు ఇది శాపం: రెండేళ్లలో ముగ్గురు హీరోల దుర్మరణం
By: Tupaki Desk | 29 Oct 2021 11:30 PM GMTప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46 ) మరణించడం కన్నడ చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపడిపోయిన ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్ ప్రాణాలు దక్కలేదు.
పునీత్మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్ర లోటు అని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పునిత్ మరణంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధానమార్గాల్లో బందోబస్తు పెంచారు. రెండు రోజులు థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్ అభిమానులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
శాండిల్ వుడ్ హీరోలు వరుసగా చనిపోతుండడం ఆ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇదో శాపంగా మారిందని అంటున్నారు. కన్నడ ఇండస్ట్రీకి ఇదేం దురదృష్టమో అని నిట్టూరుస్తున్నారు. వరుసగా రెండు సంవత్సరాల్లో ముగ్గురు స్టార్ హీరోలను శాండల్ వుడ్ కోల్పోయింది.
గత ఏడాది కన్నడ హీరో చిరంజీవి సర్జా ఇదే తరహాలో గుండెపోటుకు గురై తనువు చాలించాడు. బన్నేరుఘట్టలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇతడు యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు కావడం విశేషం.
ఇక ఆ మరుసటి సంవత్సరం ఇద్దరు స్టార్ హీరోలు కన్నుమూయడం శాండిల్ వుడ్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఏడాది మొదట్లోనే కన్నడ హీరో సంచారి విజయ్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంచారి విజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 15వ తేదీన ఆయన మరణించారు. ఇప్పటికే ఆ షాక్ నుంచి శాండల్ వుడ్ కోలుకోలేదు. అంతలోనే మాస్ హీరో ఇమేజ్, యూత్ లో క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూయడాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.