Begin typing your search above and press return to search.
ఇదే బాహుబలి.. పొన్నియన్ సెల్వన్ ల స్థాయి తేడా!
By: Tupaki Desk | 8 Sep 2022 2:30 PM GMTతమిళ్ లో రూపొందిన పొన్నియన్ సెల్వన్ సినిమాని అక్కడి మీడియా మరియు ప్రేక్షకులు బాహుబలి సినిమా తో పోల్చుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాహుబలి మాదిరిగా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుంది. జక్కన్నకి ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను చేశాడు అంటూ అక్కడి మీడియా కుప్పలు తెప్పలుగా కథనాలు రాస్తున్నాయి.
భారీ ఎత్తున అంచనాలున్న పొన్నియన్ సెల్వన్ వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందేమో కానీ బాహుబలి స్థాయి లో విజయాన్ని మాత్రం సొంతం చేసుకోదని తెలుగు ప్రేక్షకులు చాలా బలంగా వాదిస్తున్నారు. ఇదే సమయంలో పొన్నియన్ సెల్వం ఏ విషయంలో బాహుబలి కంటే తక్కువ అనే విషయమై తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తున్నారు.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన పొన్నియన్ సెల్వన్ సినిమాకి అక్కడి ఇండస్ట్రీ వారే సరైన గౌరవం మరియు గుర్తింపు ఇవ్వడం లేదు అనేది తెలుగు నెటిజన్స్ కామెంట్స్. బాహుబలి విడుదల అయిన సమయంలో ముందు వారం.. ఆ తర్వాత రెండు వారాల పాటు మరే సినిమా లు కూడా రాలేదు.
కానీ పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తుంది అంటే అక్కడ కనీసం ఇతర సినిమాల యూనిట్ సభ్యులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమా కు పోటీ అన్నట్లుగా అదే వారంలో ధనుష్ హీరోగా నటించిన నానే వరువేన్ సినిమాను విడుదల చేయబోతున్నారు.
అక్కడి ఫిల్మ్ మేకర్స్ కే పొన్నియన్ సెల్వన్ పై బాహుబలి స్థాయిలో ఉంటుందనే నమ్మకం లేదు.. ఇదే అసలైన స్థాయి తేడా రెండు సినిమాల మధ్య అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏ విషయంలో కూడా పొన్నియన్ సెల్వన్ సినిమాని బాహుబలి తో పోల్చవద్దంటూ తమిళ్ నెటిజన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఇలా కౌంటర్ ఇస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.