Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజుకు అదే అతి పెద్ద మైనస్.... ?
By: Tupaki Desk | 6 Oct 2021 7:30 AM GMTమా ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టిస్తున్న వేడి అంతా ఇంతా కాదు, ఒక వైపు తెలంగాణాలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉన్నా కూడా మా ఎన్నికలే సమ్మర్ హీట్ ని రగిలించేస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఆవేశంతో పాటు ఆలోచన మిక్స్ చేసి మరీ మంచు విష్ణు ప్యానల్ మీద విరుచుకుపడుతున్నారు. దానికి ధీటుగా విష్ణు కూడా జవాబు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే మా యుద్ధం ఈ నెల పది తరువాత కూడా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మా ఎన్నికల విషయంలో కొన్ని నెలల ముందు నుంచి బాగా ప్రిపేర్ అయిన ప్రకాష్ రాజు ఒక దశలో గెలుపు లాంచనమే అనిపించారు. మరీ ముఖ్యంగా సెప్టెంబర్ ఎండింగ్ వరకూ ఇదే సీన్. ఎపుడైతే మంచు విష్ణు ప్యానల్ తో ముందుకు వచ్చారో నాటి నుంచే పోరు తీవ్రం అని అందరికీ అర్ధం అయింది.
అంత సులువుగా ప్రకాష్ రాజ్ గెలవడు అని అంతా అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ప్రకాష్ రాజ్ కొంత వ్యతిరేకతను ఎదుర్కోంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. అదెలా అంటే ఆయన నాన్ లోకల్ ఇష్యూ మొదట్లో సమస్య కాదనుకున్నారు కానీ పోలింగునకు గడువు దగ్గర పడుతున్న కొద్దే అదే అతి పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా నటుడు రవిబాబు పెట్టిన ఒక వీడియో బైట్ అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. మా అన్నది చిన్న ఆర్గనైజేషన్. పైగా నటులకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు అయిన సంస్థ. అలాంటి సంస్థను కూడా మనం నడుపుకోలేమా. ఎవరో వచ్చి మనకు పాఠాలు చెప్పాలా అంటూ రవిబాబు ఇచ్చిన సందేశం కచ్చితంగా పనిచేసేదే అంటున్నారు.
మరో వైపు చూస్తే ఎంతైనా టాలీవుడ్ లో నటుడు మోహన్ బాబు సీనియర్. ఆయనకు ఉన్న పలుకుబడి అలాంటిది. దాంతో పాటుగా ప్రకాష్ రాజ్ ని ముందు పెట్టి కొంతమంది పెద్దలు తెర వెనక చక్రం తిప్పుతున్నారు అంటూ వస్తున్న వార్తలతో కూడా టాలీవుడ్ లో సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఆయనకు ఇబ్బంది తెచ్చిపెట్టేలా ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో నాకు సినీ పెద్దల మద్దతు అవసరం లేదు, సొంత సత్తాతోనే గెలుస్తాను అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా బూమరాంగ్ అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి పోలింగునకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ మా ఎన్నికలలో వేడి రాజుకుంటోంది. చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. అదే సమయంలో మంచు విష్ణు కూడా ధీమాగా తాను గెలిచి తీరుతాను అని చెబుతున్నారు. తనకు భారీ మెజారిటీ గ్యారంటీ అంటున్నారు. ఎవరి ధీమా ఎలా ఉన్నా చూడబోతే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడినా మాత్రం తేడా మాత్రం స్వల్పమే అని అంటున్నారు.