Begin typing your search above and press return to search.
చిరు..చరణ్ హునమాన్ జయంతి స్పెషల్ ఇదే!
By: Tupaki Desk | 16 April 2022 7:30 AM GMTశివుని అంశ.. వాయు పుత్రుడు.. అర్జునుడికి ప్రియ సఖుడు.. శ్రీరామదాసుడు.. ఎర్రని కన్నులుగలవాడు.. అమిత విక్రముడు.. సాగరాన్ని దాటినవాడు.. లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు.. సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు.. ఇలా ఎన్నో శక్తులు హనుమంతుని అనుగ్రహం. మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా అభిమానులకు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక హనుమంతుడు మెగాస్టార్ చిరంజీవి ఇష్టం దైవం అన్న సంగతి తెలిసిందే. అంజనేయస్వామికి చిన్ననాటి నుంచి అపారమైన భక్తుడు. ప్రతీ ఏడాది హనుమంతుడి వేడుకని ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారు. తండ్రి నుంచి అదే అలవాటు తనయుడు రామ్ చరణ్ కి వచ్చింది. అందుకే ఇష్టదైవం లోగోని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై అచ్చు వేయించారు.
హనుమంతుడి లోగోతో కొణిదేల బ్యానర్ రూపుదిద్దుకుంది. మెగాస్టార్ కంబ్యాక్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'వ చిత్రాన్ని తొలి ప్రయత్నంగా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. అటుపై 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బయోపిక్ ని నిర్మించి మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అదే బ్యానర్ లో తండ్రీ తనయులు 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి తనయుడికి చెందిన ఓ పాత వీడియోని షేర్ చేసారు. అందులో రామ్ చరణ్ 'ఆచార్య' సినిమా షూటింగ్లో భాగంగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో మేకప్ వేసుకుంటుండగా..ఓ కోతి లోపలికి వచ్చింది. దాన్ని చూసిన చరణ్ కాసేపు ఆటపట్టించాడు. బీస్కెట్లు తినిపించి హనుమంతుడిపై ప్రేమను చాటుకున్నారు.
శ్రీ ఆంజనేయం..ప్రసన్న ఆంజనేయం సాంగ్ ని ఆవీడియోకి సింక్ చేసి దాన్ని చిరు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట మరోసారి వైరల్ గా మారింది. వీడియో పాతదే అయినా హనుమాన్ జయంతి కావడంతో సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది.
మొత్తానికి చిరంజీవి..చరణ్ మరోసారి పండుగ రోజున అభిమానుల మనస్సులకు తాకారు. ఏపీలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయస్వామి గుడుల వద్ద పెద్ద ఎత్తు అన్న సంతర్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.