Begin typing your search above and press return to search.

ఇంటిమేంట్ సీన్స్ పై దీపిక‌ చివ‌రి నిర్ణ‌యం ఇదే!

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:30 PM GMT
ఇంటిమేంట్ సీన్స్ పై దీపిక‌ చివ‌రి నిర్ణ‌యం ఇదే!
X
బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే `గెహ్రాహియా`లో లిప్ లాక్ స‌న్నివేశాల్లో సోష‌ల్ మీడియాలో దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. పెళ్లైన హీరోయిన్ హ‌ద్దులు దాటి హీరో పెదాల్ని చుంబించ‌డంపై..ఇంటిమేట్ స‌న్నివేశాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

కొన్ని విష‌యాల్లో ప‌రిమితులు విధించుకోవాలంటూ నెటి జ‌నులు..సూచ‌న‌లు..స‌ల‌హాలు ఇస్తున్నారు. తాజాగా వీటిపై దీపికా ప‌దుకొణే సినిమా రిలీజ్ నేప‌థ్యంలో పాల్గొన్న ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

``సిద్దాంత్ చ‌తుర్వేదిలో క‌లిసి ఇంటిమేట్ స‌న్నివేశాల్లో నటించాను. అలాగ‌ని ముద్దు సీన్లు చూపించి ప్రేక్ష‌కుల్ని ఎగ్జైట్ చేయాల‌న్న‌ది మా ఉద్దేశం కాదు. క‌థ అంతా మోడ్ర‌న్ రిలేష‌న్ షిప్స్ మీద సాగుతుంది.

ప్రేమ‌లో ప‌డిన జంట మోస‌పోతుంది. దానిక‌న్నా ముందు వారి ప్రేమ ప్ర‌యాణంలో వ‌చ్చిన‌వే ఆ స‌న్నివేశాలు. స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తే ఇలాంటివి త‌ప్ప‌వు. ఇలాంటి స‌న్నివేశాలు ఒక జెండ‌ర్ కు ప‌రిమితం చేస్తే ఎలా? అన్న‌ది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం. ఎలాంటి స్ర్కిప్ట్ విన్నా ముందుగా నా సౌక‌ర్యం చూసుకుంటా. ఈ స్ర్కిప్ట్ విష‌యంలో ద‌ర్శ‌కుడు శుకున్ బాత్రాపై నాకు న‌మ్మ‌కం ఉంది.

నేను న‌టించిన అలీషా పాత్ర‌లో అవ‌న్నీ దొరికాయి. అయినా ఇంటిమేంట్ సీన్స్ లో ద‌ర్శ‌కుడు ఫ‌లానా విధంగా న‌టించాల‌ని చెప్ప‌లేదు. అలా చెబితే ఆ సినిమా చేసేదాన్ని కాదు.

అన్ని ర‌కాల కంర్స్ట్ నాకు దొరికాయి. అంత‌కు మించి ద‌ర్శ‌కుడిపై వంద‌శాతం న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టి న‌టించాన‌ని`` దీపిక తెలిపింది. బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్ లు...బెడ్ రూమ్ స‌న్నివేశాలు చాలా స‌హ‌జం. క‌థ డిమాండ్ మేర‌కు బోల్డ్ స‌న్నివేశాల్లో ఎంత‌టి న‌టైనా న‌టించాల్సిందే. పెళ్లైన చాలా మంది హీరోయిన్లు ఇంటిమేట్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నారు. అందుకు దీపికా ప‌దుకొణే మిన‌హాయింపేం కాదు.