Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 నార్త్‌ పరిస్థితికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

By:  Tupaki Desk   |   8 April 2022 7:27 AM GMT
కేజీఎఫ్‌ 2 నార్త్‌ పరిస్థితికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం
X
కన్నడ మూవీ కేజీఎఫ్‌ 1 కేవలం కన్నడంలోనే కాకుండా సౌత్‌ లో అన్ని భాషల్లోనూ మరియు నార్త్‌ లోనూ మంచి వసూళ్లను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఒక కన్నడ సినిమా గతంలో ఎప్పడు కూడా చూడని వసూళ్లను కేజీఎఫ్‌ 1 చూపించింది. కన్నడ సినిమా మార్కెట్‌ లిమిటెడ్‌ అంటూ ఒక టాక్ ఉండేది. ఆ టాక్ ను తూడ్చి పెట్టేసిన ఘనత కేజీఎఫ్ కు దక్కింది. కేజీఎఫ్‌ 1 సాధించిన వసూళ్ల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్ 2 పై ఉంది.

కరోనా వల్ల దాదాపుగా ఏడాదిన్నర కాలం ఆలస్యం అయిన కేజీఎఫ్ 2 ఏమాత్రం తగ్గలేదు.. ఇంత ఆలస్యం అయినా కూడా ప్రేక్షకులు కేజీఎఫ్ 2 కోసం రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో యశ్‌ మరో మాస్ విశ్వరూపం ను చూసేందుకు సౌత్‌ ఆడియన్స్ తో పాటు నార్త్‌ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో సౌత్ డబ్బింగ్‌ సినిమాలను ఉత్తరాది వారు తెగ చూస్తున్నారు.

పుష్ప.. ఇటీవల విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమాను కూడా పెద్ద ఎత్తున చూశారు. మరి కేజీఎఫ్ 2 ను అంతగా చూస్తారా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. తెలుగు సినిమా లకు అక్కడ మంచి ఆధరణ ఉంది.. కాని కన్నడ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు పట్టించుకుంటారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని కేజీఎఫ్ ప్రాంచైజీ అవ్వడం వల్ల కేజీఎఫ్ 2 కు ఏమాత్రం తగ్గకుండా భారీ అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అవుతున్నాయి.

కేజీఎఫ్ 2 సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో కొన్ని ఏరియాల్లో ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలు అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయ్యిందో లేదో వెంటనే లక్షల టికెట్లు అమ్ముడు పోతున్నాయి. మొదటి 12 గంటల్లోనే కేజీఎఫ్ 2 సినిమా ను చూడాలనే ఆతృతతో ఏకంగా 1.8 లక్షల మంది అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ఏ కన్నడ సినిమా కు కూడా దక్కని రికార్డులు మళ్లీ కేజీఎఫ్ 2 కు దక్కబోతున్నట్లుగా ఈ నెంబర్స్ ను బట్టి అర్థం అవుతుంది. ఇప్పటికే హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా అయిదు కోట్ల వరకు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో.. కొన్ని ముఖ్య నగరాల్లో కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు పెట్టలేదు. సింగిల్ స్క్రీన్‌ ల థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు కాలేదు.

పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయంటే లాంగ్‌ రన్‌ లో కేజీఎఫ్ 2 హిందీ వర్షన్‌ ఏ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. హిందీలో కేజీఎఫ్ 2 సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకంను కన్నడ యశ్‌ అబిమానులు వ్యక్తం చేస్తున్నారు.

అదే కనుక నిజం అయితే యశ్‌ మరో ప్రభాస్ మాదిరిగా పాన్ ఇండియా సూపర్‌ స్టార్ అనడంలో సందేహం లేదు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను కేజీఎఫ్ 2 దక్కించుకుంటే ప్రభాస్ తో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నిర్మాణం జరుగుతున్న సలార్‌ సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.