Begin typing your search above and press return to search.

ఇదేం ఫ్రాంక్‌ భయ్యా అంటూ కమెడియన్‌ పై ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   6 Feb 2022 5:41 AM GMT
ఇదేం ఫ్రాంక్‌ భయ్యా అంటూ కమెడియన్‌ పై ట్రోల్స్‌
X
అర్జున్‌ రెడ్డి కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ సోషల్‌ మీడియాలో ఈ ఏడాది తర్వాత సినిమాల్లో నటించడం లేదు.. సినిమాలకు దూరం అవుతున్నట్లుగా షేర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. ఇప్పుడిప్పుడే కమెడియన్ గా స్టార్‌ డమ్‌ లభించింది. జాతి రత్నాలు సినిమాతో మరింత పాపులారిటీ దక్కింది. హీరోగా కూడా ఇప్పటికే సినిమాలు చేశాడు.. మరిన్ని హీరో పాత్రలు కూడా వస్తున్నాయి. కమెడియన్ గా ఇంత బిజీగా ఉన్న రాహుల్‌ రామకృష్ణ సినిమాలకు గుడ్‌ బై చెప్పడం ఏంటీ అంటూ అంతా కూడా అవాక్కయ్యారు. ఆయన కామెడీ టైమింగ్ ను ఇష్టపడే వారు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మొత్తానికి కొన్ని గంటల పాటు హడావుడి అయితే కంటిన్యూ అయ్యింది.

రాహుల్‌ రామకృష్ణ తన ట్వీట్‌ తో అందరిని ఫూల్స్ ను చేశాను అంటూ మరో ట్వీట్‌ చేశాడు. ఇంత మంచి లగ్జరీ లైఫ్‌ ను ఎవరు కాదనుకుంటారు.. ఎవరు వద్దనుకుంటారు అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమాలకు దూరం అవుతున్నట్లుగా తాను చేసిన మొదటి ట్వీట్ ఫ్రాంక్ అన్నట్లుగా అతడు చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఒక ప్రముఖ సెలబ్రెటీ అయ్యి ఉండి ఇలాంటి చిల్లర ఫ్రాంక్స్ చేయడం ఏంటి భయ్యా అంటూ నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన్ను అభిమానించే వారు ఆయన తీరును తప్పబడుతున్నారు.

సోషల్‌ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉండటంతో పాటు ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న రాహుల్‌ రామకృష్ణ సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటన చేయడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంను కలిగించింది. ఆయన చేసింది ఫ్రాంక్‌ అని తెలిసిన తర్వాత ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సోషల్‌ మీడియాలో ఇలాంటివి చేయడం ద్వారా మీ గౌరవం తగ్గుతుంది భయ్యా అంటూ మరి కొందరు ఆయనకు హితవు పలికారు. మొత్తానికి ఆయన ఉద్దేశ్యంతో ఆ ట్వీట్‌ వేశాడో కాని సినిమాల నుండి తప్పుకోవడం లేదు అంటూ మళ్లీ ట్వీట్‌ చేయడం ద్వారా చాలా మంది హమ్మయ్య అంటున్నారు. మళ్లీ ఇలాంటి ట్వీట్స్ మీ నుండి ఆశించడం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.