Begin typing your search above and press return to search.
శివరాత్రి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా జరిగింది..!
By: Tupaki Desk | 10 March 2021 2:30 PM GMTమహా శివరాత్రి వచ్చిందంటే టాలీవుడ్ లో కొత్త సినిమాల జాతరతో పాటు స్పెషల్ షోలతో జాగారం చేస్తారనే విషయం తెలిసిందే. ఈసారి పండక్కి కూడా నాలుగు సినిమాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి. రేపు మార్చి 11న శర్వానంద్ 'శ్రీకారం' - నవీన్ పోలిశెట్టి 'జాతిరత్నాలు' - అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన 'గాలి సంపత్' - కన్నడ డబ్బింగ్ 'రాబర్ట్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో మూడు తెలుగు సినిమాలు కూడా క్లీన్ 'యూ' సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్నవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో డబ్బింగ్ సినిమా మినహా మిగతా మూడు సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేసి బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
యువ హీరో శర్వానంద్ హీరోగా బి. కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న 'శ్రీకారం' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 17 కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజెప్పే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ వారు నిర్మించారు. శర్వా కారణంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ రూపొందించిన 'జాతిరత్నాలు' చిత్రానికి సుమారు 11 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ లో జాతిరత్నాలు హవా చూపిస్తోంది. అలానే శ్రీ విష్ణు - రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన 'గాలి సంపత్' సినిమా దాదాపు 6.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజ్ ఈ సినిమాకి అడ్వాంటేజ్ గా మారనుంది. మరి శివరాత్రి బరిలో నిలిచిన ఈ మూడు చిత్రాల్లో ఏవి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.