Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ ని మొత్తానికి ఇలా ఇన్ వాల్వ్ చేశారు
By: Tupaki Desk | 22 April 2022 6:30 AM GMTస్టార్ డైరెక్టర్లు హీరోల మధ్య మంచి స్నేహ బంధం నెలకొంటూ వుంటుంది. అది కొన్ని సార్లు సరికొత్త ఆవిష్కరణలకు కారణంగా నిలుస్తూ వుంటుంది. 'ఆచార్య' విషయంలో ఇప్పడు అదే జరిగింది. గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తనకున్న ప్రత్యేక అనుబంధం కారణంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించి మెగా అభిమానుల మనసు గెలుచుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అదే రిపీట్ కావడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలు నెలకొన్నఈ మూవీ ఏప్రిల్ 29న అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ధర్మస్థలి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పవర్ ఫుల్ పాత్రల్లో నటించారు. ఓ దశలో నక్సలైట్ లుగా కనిపించిన తీరు, వీరిద్దరిపై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ చిత్రానికి సంబంధించి కీలకంగా నిలిచే పాదఘట్టాన్ని పరిచయం చేస్తూ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. సినిమాకు ఇది వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలవనుందని తెలిసింది. గత రెండు రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వార్తల వైరల్ అయింది. కూడా దీనిపై శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారని స్పష్టం చేశారు.
'ప్రియమైన మహేష్ 'ఆచార్య'లో మీ మనోహరమైన స్వరంతో 'పాదఘట్టం'ని పరిచయం చేసినందుకు ఆనందంగా వుంది. చాలా ప్రత్యేకమైన రీతిలో సినిమాలో భాగమైనందుకు ధన్యవాదాలు. అభిమానులు, ప్రేక్షకులు మీ మాట వినడానికి అంతే థ్రిల్ అవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
చరణ్, నేను మీ వాయిస్ ఓ వర్ ని చాలా ఇష్టపడ్డాం' అని మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో పవన్ నటించిన 'జల్సా' ఎలాగైతే మహేష్ వాయిస్ తో మొదలవుతుందో అదే తరహాలో 'ఆచార్య' కూడా మహేష్ వాయిస్ ఓవర్ తో మొదలు కానుందని చెబుతున్నారు.
విచిత్రం ఏంటంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర కోసం ముందు చరణ్ ని అనుకుని రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' కారణంగా అది కుదిరేలా లేదని చివరికి మహేష్ బాబు చేత ఆ పాత్రని కొరటాల చేయించాలనుకున్నారని ప్రచారం జరిగింది. లాక్ డౌన్ టైమ్ లో ఈ విషయాన్ని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ బయటపెట్టారు కూడా. కానీ ఇలాంటి స్క్రీప్ట్ మళ్లీ కుదరొచ్చు కుదరకపోవచ్చని.. చరణ్ ఈ పాత్రలో నటించాల్సిందేనని, తెరపై చిరుని, చరణ్ ని చూడాలని చిరు శ్రీమతి సురేఖ పట్టు బట్టడం వల్లే మహేష్ ని కాదని మళ్లీ చరణ్ తోనే ఈ పాత్రని చేయించడం విశేషం.