Begin typing your search above and press return to search.

కాంతార గురించి కమల్ రియాక్షన్ ఇదే..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 5:30 AM GMT
కాంతార గురించి కమల్ రియాక్షన్ ఇదే..!
X
ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేసిన కన్నడ పరిశ్రమ కొన్నాళ్ల పాటు కేవలం రీమేక్ సినిమాలకే అంకితమైంది. కన్నడ ఒరిజినల్ స్టోరీస్ ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్నడలో వచ్చిన శరపంజర, నాగరహావు, గజ్జె పూజ లాంటి సినిమాలు అక్కడ ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఇండియన్ సినీ మేకర్స్ ని ఆశ్చర్యపరిచాయి. అందుకే ఆ సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అయ్యాయి. 70, 80 ల్లో కన్నడ పరిశ్రమ నుంచి చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. అయితే కొన్నాళ్లు పరిశ్రమ రీమేక్ సినిమాలే చేయగా మళ్లీ ఇప్పుడు కన్నడ పరిశ్రమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.

కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో కన్నడ పరిశ్రమ సత్తా చాటగా లేటెస్ట్ గా వచ్చిన కాంతర మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కాంతార సినిమా గురించి సెలబ్రిటీస్ ఇప్పటికే ఆ సినిమా పై ప్రశంసలు అందించారు. ఈ లిస్ట్ లో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా చేరారు.

కమల్ హాసన్ కన్నడ పరిశ్రమ నుంచి ఇలాంటి కొత్త సినిమాలు రావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంతార ఉద్దేశించి కమల్ కన్నడ పరిశ్రమకు మళ్లీ పాత రోజులు వచ్చాయని ఒకప్పుడు ఆ పరిశ్రమ నుంచి వంశవృక్ష, కాడు వంటి సినిమాలు వచ్చాయి.. మళ్లీ ఆ తరహా సినిమాలు రావడం సంతోషమని అన్నారు.

కమల్ కామెంట్స్ కి కాంతర హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి ఖుషి అయ్యాడు. కమల్ హాసన్ కి తన కృతజ్ఞతలు తెలిపాడు రిషబ్ శెట్టి. కమల్ చెప్పిన సినిమాలే కాదు ఒకప్పుడు కన్నడ పరిశ్రమ లో అద్బుతమైన సినిమాలు వచ్చాయి. శరపంజర సినిమా తెలుగులో కృష్ణవేణిగా రీమేక్ చేశారు. నాగరహావు ని కోడెనాగుగా రీమేక్ చేశారు.

కన్నడ పరిశ్రమ మళ్లీ కొత్త కథలతో వెండితెర మీద అద్భుతాలు సృష్టిస్తుంది. యువ దర్శకులు కొత్త ఆలోచనలతో పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చే రేంజ్ కి పరిశ్రమని తీసుకెళ్తున్నారు. అంతకుముందు వచ్చిన కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లతో పాటుగా కాంతార సినిమాకు ఈ సక్సెస్ లో స్థానం ఉందని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.