Begin typing your search above and press return to search.

మైత్రి వారికి ఇది మామూలు దెబ్బ కాదు

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:30 AM GMT
మైత్రి వారికి ఇది మామూలు దెబ్బ కాదు
X
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తర్వాత వరుస బాక్సాఫీస్ తో అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. మొదట డిస్ట్రిబ్యూటర్స్ గా ఓవర్సీస్లో వ్యాపారాన్ని మొదలుపెట్టే అనంతరం మంచి లాభాలతో ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు. నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ మోహన్ చెరుకూరి ముగ్గురు మంచి భాగస్వాములుగా ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు.

అయితే వీరి ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ రేట్ ఇటీవల కాలంలో చాలా తగ్గింది. కొన్ని సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాయి. రంగస్థలం వరకు బాగానే కొనసాగిన వీరి ప్రయాణం ఆ తర్వాత వరుస అపజయాల అనంతరం గత ఏడాది వచ్చిన ఉప్పెన పుష్ప వరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక గత ఏడాది వరకు బాగానే కొనసాగినప్పటికీ ఈ ఏడాది మాత్రం వారికి పెద్దగా కలిసి రావడం లేదు.

ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా కొన్ని ఏరియాల్లో నష్టాలను మిగిల్చాయి. అంటే సుందరానికి సినిమా కూడా 10 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రాబోయే సినిమాలపై కూడా పెద్దగా హైప్ కనిపించడం లేదు.

హ్యాపీ బర్త్ డే, అలాగే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే రెండు ప్రాజెక్టులు నెక్స్ట్ రానున్నాయి
ఈ రెండిటిపై పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఇక మళ్ళీ ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా మాత్రమే వీరికి సరైన సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా అలాగే పుష్ప సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇక ఈ సంస్థ సర్కారు వారి పాట, అంటే సుందరనికి ఇచ్చిన ఫ్లాప్స్ నుంచి వీలైనంత త్వరగా బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు తదుపరి సినిమాల విషయంలో కొంత బిజినెస్ లో తలగ్గోక తప్పదు.

అందుకే ఆ ప్రభావం తదుపరి సినిమాలపై ఏ మాత్ర పడకుండా ఉండాలి ప్రాఫిట్స్ లో కొనసాగలి అంటే వీలైనంత త్వరగా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది.