Begin typing your search above and press return to search.

2 ఫ్రీ టికెట్స్... బుల్ బుల్ తో కలిసి సినిమాను బాబు చూడొచ్చు

By:  Tupaki Desk   |   29 March 2019 5:17 AM GMT
2 ఫ్రీ టికెట్స్... బుల్ బుల్ తో కలిసి  సినిమాను బాబు చూడొచ్చు
X
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఈరోజే రిలీజ్. తెలంగాణాలో యధావిధిగా రిలీజ్ అవుతున్నా ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాతంగా రిలీజ్ అవుతున్న తన సినిమా ఏపీలో రిలీజ్ కాకుండా ఉంటే వర్మ ఊరుకుంటాడా? ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధమే చేస్తున్నాడు. వరస ట్వీట్లతో విరుచుకుపడుతున్నాడు. రాత్రి నుండి ఇప్పటివరకూ వర్మ ట్వీట్లపై ఒక లుక్ వేయండి.

"ప్రకటన: షెడ్యూల్ ప్రకారం #లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా 29 తారీఖున రిలీజ్ అవుతోంది ఒక్క ఎపీలో తప్ప. ఎపీ కోర్ట్ ఆర్డర్ కు వ్యతిరేకంగా మేము సుప్రీమ్ కోర్టుకు వెళ్తున్నాం. రేపు ఉదయం 11 గంటలకు నేను ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నాను. అన్నీ విషయాల గురించి మాట్లాడతాను."

"ఎన్టీఆర్ మరణానికి ముందు సింహగర్జన మీటింగ్ కు అనుమతినివ్వకుండా చేసినట్టే ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను రిలీజ్ చేయనివ్వకుండా మరోసారి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. ఆ వ్యక్తి ఖచ్చితంగా వెన్నుపోటు స్పెషలిస్ట్.. ఏమంటారు?"

"ప్రప్రధమంగా తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కింది. కోర్ట్ ఆర్డర్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తప్ప తెలంగాణలోనూ ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరూ సినిమా చూడొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేరు. హత విధి!!!"

"లక్ష్మీస్ ఎన్టీఆర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు తన సొంత రాష్ట్రం ఎపీ లో ఈ సినిమాను చూడలేడు కాబట్టి ఆయన ఏ థియేటర్ లో చూడాలనుకుంటే ఆ థియేటర్ లో మేము 2 టికెట్స్ ఆఫర్ చేస్తున్నాం. బుల్ బుల్ తో కలిసి ఆయన సినిమాను చూడొచ్చు."

"తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ రేపు తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో?"

లెఫ్ట్ లక్ష్మీ పార్వతి.. రైట్ ఎన్టీఆర్.. మధ్యలో చంద్రబాబు పాత్రధారులు ఉన్న ఫోటో పోస్ట్ చేసి ఈ ట్వీట్ చేశాడు వర్మ .. "లెఫ్ట్ ఒకే ఒకే.. రైట్ లో జూనియర్ ఆర్టిస్ట్. మధ్యలో సెంట్రల్ పాయింట్ ఉంది "

"సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలం లో నీళ్లు తీసి శపిస్తున్నాం ..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు"

క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఒక వీడియో బైట్ పోస్ట్ చేశాడు. ఆ వీడియో లో ఎన్టీఆర్ తన సినిమా రిలీజ్ ను ఆపుతున్నందుకు ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. "సినిమా ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీ కి లేదు" అంటారు .

ఇంతటితో ఆగలేదు గురుడు. మహేష్ కత్తి చేసిన మరో మంతెత్తించే ట్వీట్ కు రీట్వీట్ చేశాడు.."చిత్తూరులో ఉన్నోళ్లు చెన్నైకి. అనంతపురం.. కడపలో ఉన్నోళ్లు బెంగళూరుకి. కర్నూలులో ఉన్నోళ్లు పక్కనే ఉన్న కర్ణాటకకు. విజయవాడలో ఉన్నోళ్లు సూర్యాపేటకు. ఉత్తరాంధ్రలో ఉన్నోళ్లు ఒరిస్సాకు వెళ్లి "లక్ష్మీస్ ఎన్టీఆర్" చూడాలనే బలీయమైన కోర్కె వెలిబుచ్ఛుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్స్ కాకుండా.. న్యూట్రల్ ఓటర్లకు ఈ సినిమా చూపించే బాధ్యత పార్టీ తీసుకుని ఏర్పాట్లు చేయాలని నా మనవి. ప్రచారానికి పెట్టే ఖర్చులో పదోవంతు పెడితే చాలు...చంద్రబాబు గురించి మనం గొంతు చించుకొని చెప్పనక్కరలేదు. #అర్జీవీ ఈజ్ రాకింగ్."


For Video Click Here