Begin typing your search above and press return to search.

`జెర్సీ`లో ఒకే ఒక్క మిస్టేక్‌ అదే

By:  Tupaki Desk   |   20 April 2019 5:30 PM GMT
`జెర్సీ`లో ఒకే ఒక్క మిస్టేక్‌ అదే
X
ఇండియాలోనే ఇంత అథెంటిగ్గా క్రికెట్ పై వేరొక సినిమా తీయ‌లేదు! అన్నంత‌గా `జెర్సీ` సినిమాని తెర‌కెక్కించారు గౌత‌మ్ తిన్న‌నూరి. భారీ స్పాన్ ఉన్న కాన్సెప్ట్ ని ఎంచుకుని ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌థ‌ను న‌డిపించ‌డంలో స‌క్సెస‌య్యాడు. లైవ్ క్రికెట్ చూసిన‌ట్టే ఉంటుంది! అని హీరో నాని చెప్పిన‌ట్టే ఈ సినిమాలో ఆట‌ను అంతే లైవ్ లీగా చూపించ‌డంలో స‌క్సెస‌య్యాడు. అయితే ఒక ఆటపై సినిమా తీయడం అంటేనే ఓ స‌వాల్. ఇందులో ద‌ర్శ‌కుడు ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేదా? అంటే క్రిటిక్స్ ఆ త‌ప్పును క‌నిపెట్ట‌లేక‌పోయార‌నే చెప్పాలి. ఒక‌వేళ క‌నిపెట్టినా దానిని సినిమాటిక్ లిబ‌ర్టీ అనుకుని వ‌దిలేసి ఉండాలి. ఇదే పాయింట్ నేడు హైద‌రాబాద్ లో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఇంట‌ర్వ్యూలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

క్రికెట్ రూల్స్ విష‌యంలో ఏం త‌ప్పు చేశారు..? అన్న‌ది ద‌ర్శ‌కుడే స్వ‌యంగా రివీల్ చేశారు. అస‌లు రంజీ మ్యాచ్ ఏదైనా డే & నైట్ ఆడ‌తారా? అంటే 1995లో మాత్రం ఒక‌సారి అలా జ‌రిగింది. అది నేను చూశాను. ఇక అది త‌ప్పు కాదు కానీ.. డే అండ్ నైట్ మ్యాచ్ లో రెడ్ బాల్ తో ఆడ‌టం అన్న‌ది రాంగ్. వాస్త‌వంగా తెల్ల బంతినే ఉప‌యోగించాలి. కానీ క‌థ‌లో యూనిఫామ్ ప‌రంగా కంటిన్యూటీ పోతుంద‌ని భావించి సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకుని చేసిన త‌ప్పు అది అని గౌత‌మ్ తెలిపారు. ఇటీవ‌లి కాలంలో డే అండ్ నైట్ మ్యాచ్ ల‌కు పింక్ బంతిని ఉప‌యోగిస్తున్నారు. ఆట‌గాళ్లు ధ‌రించిన వైట్ డ్రెస్ కంటిన్యూటీ ని మార్చ‌కూడ‌ద‌నే రెడ్ బాల్ ని ఉప‌యోగించేశామ‌ని తెలిపారు.

ఒక్కో సీన్ చిత్రీక‌రించ‌డానికి ఎంత స‌మ‌యం ప‌ట్టేది? అని ప్ర‌శ్నిస్తే.. 15 నిమిషాల స‌న్నివేశం తెర‌కెక్కించేందుకు ఒక రోజు కానీ.. ఒక‌టిన్న‌ర రోజులు కానీ ప‌ట్టేద‌ని గౌత‌మ్ తెలిపారు. ప్ర‌తిదీ స్క్రిప్టు- స్టోరీ బోర్డ్ ముందే రాసుకున్నాం కాబ‌ట్టి ప‌ని సులువైంది. చాలా ముందు జాగ్ర‌త్త‌తో వెళ్లామ‌ని తెలిపారు. నాకు క్రికెట్ బాగా తెలుసు. బాగా ఆడ‌తాను. అందుకే క్రికెట్ నేప‌థ్యంలో క‌థ‌ను ఎంపిక చేసుకున్నానని గౌత‌మ్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఒక‌ చిన్న ఇంట్లో ఉండే క‌థానాయ‌కుడు ఒక పెద్ద గ్రౌండ్ లోకి వెళ్లి అంత‌మందిలో ఆడుతుంటే ఆ ఎమోష‌న్ క‌నెక్టివిటీ ఎలా ఉంటుందో ముందే ఊహించుకున్నాన‌ని గౌత‌మ్ వెల్ల‌డించారు. ఈ చిత్రంలో నాని తో పాటు మ‌రో న‌టుడు త‌ప్ప మిగ‌తా అంద‌రూ రియ‌ల్ క్రికెట‌ర్ల‌నే ఎంచుకోవ‌డం వ‌ల్ల అంత లైవ్ లీ నెస్ వ‌చ్చింద‌ని సీక్రెట్ ని రివీల్ చేశారు. అర్జున్ అంత క‌ష్టం నేను ఎప్పుడూ రియ‌ల్ లైఫ్ లో ప‌డ‌లేదు. అత‌డి పాత్ర పూర్తిగా ఫిక్ష‌నల్ అని వెల్ల‌డించారు. మ‌ళ్లీ రావా చిత్రాన్ని 30 రోజుల్లో చిత్రీక‌రిస్తే ఈ సినిమా కోసం చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకున్నామ‌ని.. బ‌డ్జెట్ ప‌రంగానూ బిగ్ స్పాన్ ల‌భించింద‌ని తెలిపారు.