Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌-క‌మ‌ల్ మ‌ధ్య‌లో శంక‌ర్ రెస్ట్ ఇలా!

By:  Tupaki Desk   |   24 Dec 2022 9:13 AM GMT
చ‌ర‌ణ్‌-క‌మ‌ల్ మ‌ధ్య‌లో శంక‌ర్ రెస్ట్ ఇలా!
X
స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్  ఏకాకాలంలో రెండు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 15వ చిత్రానికి....విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో భార‌తీయుడు-2 కోసం ప‌ని చేస్తున్నారు. ఇలా ప‌నిచేయ‌డం అన్న‌ది అనుకోకుండా చోటు చేసుకుంది. అయితే ఈ కార‌ణంతో శంక‌ర్  ఎంత‌గా ఒత్తిడికి గుర‌వుతున్నారు? అన్న‌ది అత‌నికే తెలుసు. రెండు పెద్ద ప్రాజెక్ట్ లు కావ‌డంతో?  విశ్రాంతి లేకుండా ప‌నిచేయాల్సి వ‌స్తోంది.

కొన్ని నెల‌లుగా శంక‌ర్ ఇలా ప‌ని చేసుకుంటూనే వ‌చ్చారు. కానీ ఈ ర‌క‌మైన ఒత్తిడిని జ‌యించ‌డానికి ఆయ‌న ఓప్ర‌త్యేక‌మైన‌ ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్లిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తుంది.  నెల రోజుల్ని రెండు సినిమాల‌కు ఆయ‌న ఇలా షెడ్యూల్ వేసుకుని చిత్రీక‌ర‌ణ ముందుకు తీసుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.  మొద‌టి ప‌ది రోజులు చ‌ర‌ణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారుట‌.

అటుపై ప‌ది రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారుట‌. ఆ త‌ర్వాత 'భార‌తీయుడు -2' షూటింగ్ కి వెళ్తున్నారుట‌. ఏక‌ధాటిగా రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి చేయ‌డం మొద‌ట్లో క‌ష్టంగా ఉండ‌టంతో మ‌ధ్య‌లో ఈ ర‌క‌మైన ప్ర‌ణాళిక వేసుకుని ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది స‌రైన ప‌ర‌ణాళిక. విశ్రాంతి లేకుండా ప‌ని చేయ‌డం అన్న‌ది అసాధ్యం. అందులోనూ క్రియేటివ్ రంగంలో విరామం త‌ప్ప‌ని స‌రి. అందుకే శంక‌ర్ ఈ క‌రంగా మందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఆర్ సీ   15వ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తి చేసారుట‌. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్..కొన్నిపాట‌ల షూటింగ్ పూర్తి చేస్తే షూటింగ్ పూర్త‌యిన‌ట్లేన‌ని స‌మాచారం. అలాగే భార‌తీయుడు -2 షూటింగ్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం 35శాత‌మే పూర్త‌యిందిట‌.

త్వ‌ర‌లో ఆ సినిమాకి పూర్తి స్థాయిలో స‌మ‌యం కేటాయించ‌నున్నారని తెలుస్తోంది. చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ క్లైమాక్స్  కి వ‌చ్చిన నేప‌థ్యంలో ఇక‌పై భార‌తీయుడు -2 షూట్ వేగ‌వంతం చేయ‌డానికి అవకాశం  ఉంది. తాజా అప్డేట్ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ సినిమా 2023 లో రిలీజ్ అవ్వ‌డం ప‌క్కా అని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.