Begin typing your search above and press return to search.

#SSMB 29 పాన్ వ‌ర‌ల్డ్ సినిమా ఇది!

By:  Tupaki Desk   |   14 Sep 2022 8:30 AM GMT
#SSMB 29 పాన్ వ‌ర‌ల్డ్ సినిమా ఇది!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ -రాజ‌మౌళి ద్వ‌యం పాన్ ఇండియాని దాటి అంత‌కు మించి ప్లాన్ చేస్తోందా? పాన్ వ‌ర‌ల్డ్ నే ఈ ద్వ‌యం షేక్ చేయ‌బోతుందా? జ‌క్క‌న్న అలాంటి కంటెంట్ లో సూప‌ర్ స్టార్ ని ఆవిష్క‌రించ‌బోతున్నారా? అంటే అవున‌నే చెబుతున్నాయి తాజా స‌న్నివేశాలు. ఇంత‌కాలం పాన్ ఇండియా అంటూ చంక‌లు గుద్దుకున్న ఫ్యాన్స్ కి అంత‌కు మించి ట్రీట్ అందించ‌బో తున్నారు జ‌క్క‌న్న‌.

వ‌ర‌ల్డ్ సినిమా యూనివ‌ర్శ‌నే షేక్ చేసే కంటెంట్ తో రాబోతున్న‌ట్లు తాజా లీకులు సంకేతాలు పాస్ చేస్త‌న్నాయి. ఆఫ్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గానే ఇంత‌కాలం నెట్టింట వైర‌ల్ అయింది. కానీ జ‌క్క‌న్న కంటెంట్ లో అంత‌కు మించి విష‌యం ఉండేలా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ఓ అంత‌ర్జాతీయ వేదిక సాక్షిగా గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అనే ఓ కొత్త ప‌దాన్ని వాడారు.

అంటే ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి' చెందే అని అర్థం వ‌స్తుంది. జ‌క్క‌న్న వ‌ర‌ల్డ్ వేదిక‌పైనే అలాంటి మాట అన్నారంటే? మ‌హేష్ ని పాన్ ఇండియా కాదు పాన్ వ‌ర‌ల్డ్ నే షేక్ చేసేలా దించ‌బోతున్నాడంటూ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. ఇంత‌వ‌ర‌కూ మ‌హేష్ పాన్ ఇండియాలో సినిమా చేయ‌క‌పోయినా ఆయ‌న‌కు పాన్ ఇండియా గుర్తింపు ఉండ‌నే ఉంది.

కేవ‌లం బ్రాండింగ్స్ తో నే ఇండియా మొత్తం ఫేమ‌స్ అయ్యాడు. బాలీవుడ్ లో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా? అత‌ను అటువైపు చూసింది లేదు. తెలుగులోనే ఉంటాను..ఇక్క‌డే సినిమాలు చేస్తానంటూ మాతృభాష‌పై త‌న మ‌మ‌కారాన్ని చాటుకున్నారు. ఇక బాహుబ‌లి త‌ర్వాత జ‌క్క‌న్న కి గ్లోబ‌ల్ స్థాయిలో వ‌చ్చిన గుర్తింపు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

జ‌క్క‌న్న క్రియేటివిటీని బాలీవుడ్ త‌న్నుకుపోవాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నించింది. కానీ ఆయ‌న కూడా టాలీవుడ్ లో ఉండే వ‌ర‌డ్స్ క్రియేట్ చేస్తాన‌ని..ఆ దిశ‌గా ప్ర‌యాణం చేస్తున్నాడు. ఇటీవ‌లే ఆర్ ఆర్ ఆర్ తో మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చాటి చెప్పాడు. తార‌క్ ఆస్కార్ రేసులో నిల‌వ‌డం...చ‌ర‌ణ్ కి హాలీవుడ్ అవ‌కాశాలు రావ‌డం.. ఇలా కొత‌న్ని పాజిటివ్ వైబ్స్ జ‌క్క‌న్న రేంజ్ ని చాటా చెబుతున్నాయి.

ట్రిపుల్ ఆర్ త‌ర్వాత బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు తొంగి చూస్తుంది. రాజ‌మౌళి ఆహ్వానించాలేగానీ టాలీవుడ్ కి వ‌చ్చి సైతం సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ హీరోలు క్యూలో ఉన్నారు. ఆలాంటి ట్యాలెంటెడ్ కి మ‌హేష్ లాంటి క్రేజీ స్టార్ దొరికాడంటే? ఆ కాంబినేష‌న్ పాన్ ఇండియాని షేక్ చేస్తుందా? పాన్ వ‌ర‌ల్డ్ నే షేక్ చేస్తాడా? అన్న‌ది ఆలోచించాల్సిన విష‌య‌మే.

హాలీవుడ్డే టాలీవుడ్కి దిగొచ్చేలా ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ఉంటుందంటూ జ‌క్క‌న్న ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. ఒక్క సినిమాతోనే మ‌హేష్ హాలీవుడ్ నే ట‌చ్ చేస్తాడంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌మౌళి ఎంపిక చేసుకున్న కంటెంట్..మ‌హేష్ స్టార్ డ‌మ్..టెక్నిక‌ల్ గా సినిమా స్టాండ‌ర్స్డ్ హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయంటూ లీకులందుతున్నాయి. మ‌రి ఆ సంగ‌తేంటో? తేలాలంటే 2025 వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.