Begin typing your search above and press return to search.

లోకేష్ క‌న‌గ‌రాజ్ 10 ఏళ్ల ప్ర‌ణాళిక ఇది!

By:  Tupaki Desk   |   13 Dec 2022 8:30 AM GMT
లోకేష్ క‌న‌గ‌రాజ్ 10 ఏళ్ల ప్ర‌ణాళిక ఇది!
X
'ఖైదీ'..'మస్ట‌ర్'..'విక్ర‌మ్' వంటి హ్యాట్రిక్ విజ‌యాల‌తో యంగ్ ట్యాలెంటెండ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ పాన్ ఇండియా వైడ్ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్రత్యేక‌మైన బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇండియాలోనే తానో డిఫ‌రెంట్ మేక‌ర్ ని అని 'ఖైదీ'..'విక్ర‌మ్' లాంటి చిత్రాలు నిరూపించాయి. ఈ చిత్రాల‌కు ఆయ‌న‌కు క‌ల్ట్ ఫాలోయింగ్ ని తీసుకొచ్చాయి.

ద‌ర్శ‌కుడిగా ఇప్పుడాతను వెంట హీరోలే పడుతున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోలు సైతం క‌న‌గ‌రాజ్ తోసినిమా చేయ‌డానికి వెయిట్ చేస్తున్నారు. కానీ ఆయ‌న చేయ‌లేని స్థితి లో ఉన్నాడు. తాజాగా లోకేష్ క‌న‌గ‌రాజ్ భ‌విష్య‌త్ ప్లానింగ్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు. దాదాపు ప‌దేళ్ల ప‌క్కా ప్రళాళిక ఆయ‌న వ‌ద్ద సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపారు.

ద‌శాబ్ధం పాటు చేయ‌గ‌లిగే క‌థ‌లున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం విజ‌య్ తో 67వ సినిమా చేస్తున్నారు. అలాగే ఖైదీ-2..విక్ర‌మ్ సీక్వెల్.. సూర్య‌తో ఓ స్వ‌తంత్ర్య సినిమా కూడా చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇంకా ఆయ‌న వ‌ద్ద ఎల్ సీయూ ( లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్శ్) ఫార్మెట్ లో సినిమాలు చేయ‌నున్నారు. హాలీవుడ్ మార్వెల్ సిరీస్ త‌ర‌హాలో ఆయ‌నకో యూనిక్ నెస్ ఉంది.

ఆ ప్ర‌కారం లోకేష్ వ‌ద్ద ప‌దేళ్ల‌కు త‌గ్గ క‌థ‌లు సిద్దం చేసి పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇండియాలో ఈ ఫార్మెట్ ని ప‌రిచ‌యం చేసిన మొట్ట మొద‌టి ద‌ర్శ‌కుడిగానూ లోకేష్ ని చెప్పొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం సీక్వెల్స్ ..వాటికి కంటున్యూటీ క‌థ‌లు మాత్ర‌మే తెర‌పైకి వ‌చ్చేవి. సినిమాటిక్ యూనివ‌ర్శ‌ల్ లో సినిమాలు చేయ‌డం అన్న‌ది కేవ‌లం హాలీవుడ్ కే చెల్లింది.

స‌రిగ్గా అదే ఫార్ములాని బేస్ చేసుకుని లోకేష్ కెరీర్ ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త‌ల‌పతి విజ‌య్ తో 67వ సినిమాకి ప‌నిచేస్తున్నారు. ఇది ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్లో ఉంది. వ‌చ్చే ఏడాది ఈసినిమా ప్రారంభం కానుంది. అటుపై 'ఖైదీ -2' తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది. ఇందులో సూర్య రోలెక్స్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.