Begin typing your search above and press return to search.

అల వైకుంఠపురం హిందీ వివాదం ఇది

By:  Tupaki Desk   |   25 Jan 2022 10:32 AM GMT
అల వైకుంఠపురం హిందీ వివాదం ఇది
X
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ మద్య వివాదానికి కారణం అయ్యింది. అల వైకుంఠపురం లో సినిమా ను రాధాకృష్ణ తో కలిసి అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెల్సిందే.

అల వైకుంఠపురంలో సినిమా డబ్బింగ్‌ మరియు రీమేక్ రైట్స్ ను మనీష్ గోల్డ్‌ మైన్‌ బ్యానర్‌ ద్వారా కొనుగోలు చేశాడు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ తో రీమేక్ రైట్స్ ను తిరిగి అల్లు అరవింద్‌ భారీ మొత్తానికి మనీష్ నుండి కొనుగోలు చేయడం జరిగింది. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి 'షెహజాదా' అనే టైటిల్‌ తో రీమేక్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. కార్తీక్‌ ఆర్యన్ హీరోగా ఈ రీమేక్ రూపొందుతుంది.

పుష్ప సినిమా తో అల్లు అర్జున్‌ కు అనూహ్యంగా ఉత్తరాదిన మంచి గుర్తింపు దక్కింది. కనుక అల వైకుంఠపురంలో డబ్బింగ్‌ రైట్స్ తనవద్దే ఉన్నాయి కనుక మనీష్‌ ఈనెల 26న అల వైకుంఠపురంలో డబ్బింగ్‌ వర్షన్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

డబ్బింగ్‌ వర్క్ కూడా పూర్తి చేసి డబ్బింగ్‌ వర్షన్ కు సెన్సార్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే అనూహ్యంగా రీమేక్‌ లో నటిస్తున్న కార్తీక్‌ ఆర్యన్ డబ్బింగ్‌ వర్షన్‌ విడుదల అయితే తాను రీమేక్ లో నటించలేను అంటూ తేల్చి చెప్పాడట. దాంతో ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమా డబ్బింగ్ వర్షన్‌ విడుదల విషయమై మనీష్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.

ఈ సమయంలోనే కార్తీక్‌ ఆర్యన్ పై మనీష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్ ఫ్రొఫెషనల్‌ అంటూ కార్తీక్‌ ఆర్యన్‌ ను దుమ్మెత్తి పోశాడు. తాను ఈ నిర్ణయాన్ని హీరో కోసం తీసుకోలేదని... షెహజాదా నిర్మాతలు నాకు పదేళ్లుగా తెలుసు. వారి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. వారు సినిమా క్యాన్సిల్‌ అయితే 40 కోట్లు నష్టపోతారు. అందుకే నేను డబ్బింగ్ వర్షన్‌ ను థియేటర్‌ రిలీజ్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. మనీష్ అల వైకుంఠపురంలో సినిమా డబ్బింగ్ స్క్రీనింగ్‌ ను క్యాన్సిల్‌ చేసుకున్న నేపథ్యంలో షెహజాదా సినిమా ను కార్తీక్‌ ఆర్యన్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి.

పుష్ప సినిమా కంటే మరింత భారీ చిత్రంగా అల వైకుంఠపురం లో రీమేక్ ఉంటుందనే నమ్మకంను మనీష్ వ్యక్తం చేస్తూ తనకు నష్టం అని తెలిసినా కూడా తప్పని పరిస్థితుల్లో డబ్బింగ్ రిలీజ్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.