Begin typing your search above and press return to search.

'RRR'లో బెస్ట్ VFX షాట్ ఇదే!

By:  Tupaki Desk   |   30 May 2022 5:20 AM GMT
RRRలో బెస్ట్ VFX షాట్ ఇదే!
X
పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 1200 కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన భార‌తీయ మూడ‌వ చిత్రంగా నిలిచింది. ఇది ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రం అన్న‌ది వాస్త‌వం. వాణిజ్య అంశాల్ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్ర‌మిది. క‌థ ప‌రంగా..ఎమోష‌న్ ప‌రంగా స్ర్టాంగ్ స్ర్కిప్ట్ అయితే కాదు.

ఇక విజువ‌ల్ గానూ సినిమాలో హైలైట్ అయ్యే అంశాలు కూడా పెద్ద‌గా లేవు. సినిమా మొత్తానికి మూడు..నాలుగు సీన్లు త‌ప్ప‌! విజువ‌ల్ గా అంతగా హైలైట్ కాలేదు. బ్రిటీష్ సామ్రాజం కోసం ఏర్పాటు చేసిన సెట్లు ! ఇంకొన్ని సెట్లు వేసినా బిగ్ స్ర్కీన్ పై అంత గొప్ప అనుభూతినైతే ఇవ్వ‌లేదు. ఇక సినిమాలో విజువ‌ల్ ఎఫెక్స్ట్ మాత్రం హైలైట్ గా నిలిచాయి.

విజువ‌ల్ మాంత్రికుడు శ్రీనివాస మోహ‌న‌న్ మ‌రోసారి ఎఫెక్స్ట్ లో త‌న‌దైన ముద్ర వేసారు. తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' లో బెస్ట్ గా నిలిచిన కొన్ని చిత్రాల్ని పోస్ట్ చేసారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప‌రిచ‌య స‌న్నివేశాలు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతాయి. అందులో ఫ‌స్ట్ షాట్ లోనే క‌చ్చా క‌ట్టి అడ‌వి బిడ్డ‌గా త‌న పాత్ర తీరును చెప్పే ప్ర‌య‌త్నం చేస్తారు.

తాజాగా ఆ షాట్ కి సంబంధించిన విఎక్స్ ఎఫ్ అనుభూతిని శ్రీనివాస్ మోహ‌న్ పంచుకున్నారు. భారీ చెట్ల మ‌ధ్య‌లో భీమ్ కూర్చుని ఉన్న సీన్ ఓ పెద్ద సెట్ అని తెలుస్తుంది. అది ఒరిజిన‌ల్ అడ‌విలో షూట్ చేసిన స‌న్నివేశాలు కావు. ప్ర‌త్యేకంగా అందుకోసం సెట్ నిర్మించి దాని మ‌ధ్య‌లో ఎన్టీఆర్ పై స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

దానికి సంబంధించి గ్రౌండ్ లెవల్ వర్క్ ఎలా జ‌రిగింద‌న్న‌ది ఇక్క‌డ చిత్రాల్ని ప‌రిశీలిస్తే అర్ధ‌మ‌వుతుంది. ఇది పూర్తిగా జ‌క్క‌న్న క్రియేటివిటీని ఆధారంగా చేసుకునే ఇలా డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అందుకోసం కొంత మంది హాలీవుడ్ టెక్నీషియ‌న్ల స‌హాయం సైతం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ వేదిక‌గా శ్రీనివాస మోహ‌న్ వెల్ల‌డిస్తూ జ‌క్క‌న్న ప‌నిత‌నాన్ని ఆకాశానికి ఎత్తేసారు.

"అద్దం అనుభూతిని పొంద‌డానికి ప్ర‌తీ ఒక్క‌రు తార‌క్ 9999 తీసుకుంటారు. నీరు స్థిర‌ప‌డే వ‌ర‌కూ కొన్ని నిమిషాలు ఎంతో ఓపిక‌గా ఎదురుచూసి అందులో తార‌క్ షాడో ప‌డేలా చూసుకుని షాట్ తీయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఎంతో అంకిత భావంతో చేయాలి.

అత‌ని క‌మిట్ మెంట్..డెడికేష‌న్ కి వంద‌నాలు" అని శ్రీనివాస మోహ‌న్ తెలిపారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో డి.వి.వి దాన‌య్య నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఖ‌ర్చు విషయంలో ఏమాత్రం రాజీ ప‌డ‌లేదు కాబ‌ట్టే అంత బెస్ట్ అవుట్ ఫుట్ వ‌చ్చింది.