Begin typing your search above and press return to search.
వీడియో: కేజీఎఫ్ 2 డైరెక్షన్ టీమ్ ఇదే
By: Tupaki Desk | 10 May 2022 4:28 AM GMT'కేజీఎఫ్ 2' సంచలనాల గురించి నిరంతరం చర్చ సాగుతోంది. రోజుకో రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ప్రశాంత్ నీల్ సినిమా అగ్రపథం వైపు దూసుకుపోతోంది. ఇప్పటికి హిందీ చిత్రసీమలో బాహుబలి 2 తర్వాతి స్థానం కేజీఎఫ్ 2 కే దక్కింది. 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టేందుకు కేజీఎఫ్ 2 అడుగులు వేస్తోంది. రోజుకు 8కోట్లు వసూలు చేస్తూ హిందీ బెల్ట్ లో పాగా వేసిన కేజీఎఫ్ 2 ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ సినిమాలు పోటీబరిలో ఉన్న హీరోపంథి 2- రన్ వే 34 లను బీట్ చేస్తూ రికార్డులు తిరగరాస్తోంది.
అయితే ఇలాంటి గ్రేట్ మూవీని తెరకెక్కించిన డైరెక్షన్ టీమ్ ఎలా ఉంది? అంటే... దానికి సమాధానంగా ప్రశాంత్ నీల్ ఒక విజువల్ ని రిలీజ్ చేసారు. ది కాప్టెన్స్ క్రూ #KGF 2 ప్రశాంత్ నీల్ తన టీమ్ ని పరిచయం చేసాడు. ఆన్ లొకేషన్ ఈ బృందం సందడి వీడియోలో కనిపిస్తోంది.
ఎల్ డోరాడో అంటే ఏమిటీ? ఎల్ డోరాడో ది సిటీ ఆఫ్ గోల్డ్ 16వ శతాబ్దంలో పూర్తిగా బంగారంతో తయారు చేసిన నగరం అని హిస్టరీలో లిఖితమై ఉంది. ఎల్ డోరాడో అనేది స్పానిష్ పదం. ఇది నాటి రోజుల్లో ముఖ్యంగా స్పానిష్ ద్వారా నిధి వేటకు కారణమవుతుంది.
K.G.F చిత్రంలో - ఎల్ డొరాడో అనేది `కోలార్ గోల్డ్ ఫీల్డ్స్`లో కీలకమైన ఘని అని చెప్పాలి. ఇది కొందరు వాటాదారుల మధ్య ఆధిపత్య పోరుకు కారణం అయిన బంగారు గనుల సముదాయంగా చెప్పొచ్చు.
KGF చిత్రంలో వారు గోల్డ్ మైనింగ్ ప్రక్రియను సరిగ్గా చూపించలేదు కానీ బంగారంపై ఆధిపత్యం కోసం కొట్టుకునే మాఫియాని చూపించారు. వారు KGF బంగారాన్ని- అంతిమ ఉత్పత్తిని తెరపై కనిపించేలా చూపించలేదు.. ఎందుకంటే మైనర్లు పూర్తి చేసిన మెరుగుపెట్టిన ఉత్పత్తిని చూడలేరు... అంటూ లాజిక్ వాడారు.
రాకీ- గరుడుడిని చంపి అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందన్నది తెరపై చూపించారు. గరుడ హత్యకు గురయ్యాక ప్రజలందరూ సంతోషంగా కనిపిస్తారు. కానీ రాఖీ బాయ్ కి ఇప్పుడు KGF మొత్తం కావాలి. అయితే ఇంతలోనే అధీరా ఎంట్రీ ఇస్తాడు. అధీర- రెండవ భాగంలో ముఖ్యమైన పాత్ర ..రాకీతో ముఖాముఖి వార్ నడిపించే పాత్ర ఇది.
అధ్యాయం 2 లో పార్ట్ 1 కి భిన్నంగ మరొక అద్భుతమైన కథనం ప్రారంభమవుతుంది. దాని తర్వాత వానర (గరుడ అంగరక్షకుడు) మరియు మైనింగ్ బానిసల మధ్య పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో రమణ .. వానరాలను మైనింగ్ ప్రజలు వారిపై ప్రతీకారం తీర్చుకోవడంతో క్రూరంగా చంపబడతారు. తర్వాత రాకీ వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించి బానిసలుగా కాకుండా ఉద్యోగులుగా చూస్తాడు.
రమికా సేన్ ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతారు. చివరిగా మొదటి అధ్యాయంలో భారతదేశంలోని అతిపెద్ద నేరస్థుడిని తుడిచిపెట్టమని ఆమె సైన్యాన్ని ఆదేశించిన రమిక సేన్ ని చూపారు. అక్కడ రాకీని చూపించారు. సంవత్సరం 1981 అని అంటే 1978 నుండి 1981 వరకు రాకీ KGFలో ఉండి ఇతరులను చంపేస్తుంటాడు అని చూపారు. ఓవరాల్ గా ప్రశాంత్ నీల్ హీరోయిజం ఎలివేషన్ కానీ .. భారీతనం నిండిన యాక్షన్ సన్నివేశాలు విజువలైజేషన్ దేశ ప్రజలకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా 1100 కోట్ల వసూళ్ల దిశగా సాగుతోంది. బాలీవుడ్ లో 500 కోట్ల వసూళ్ల వైపు పయనం సాగిస్తుండడం ఒక సంచలనం.