Begin typing your search above and press return to search.
చిరు `భోళా శంకర్` లాంచ్ డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 27 Oct 2021 6:59 AM GMTమెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాలతో `ఆచార్య` చిత్రీకరణను పూర్తి చేయగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారని కథనాలొచ్చాయి. తదుపరి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రీకరణ సాగుతోంది. ఈ మూవీ చిత్రీకరణలో ఉండగానే చిరు చేతికి చిన్న పాటి గాయం అయిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటూ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ బ్యాంకుల సేవలందించిన అభిమానులతో కృతజ్ఞతా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
తాజా సమాచారం మేరకు నవంబర్ 11న చిరంజీవి చిత్రం భోళా శంకర్ ప్రారంభోత్సవం జరగనుందని టీమ్ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్ 22న చిరంజీవి 66వ పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్ టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ ని సూపర్ స్టార్ మహేష్ ఆవిష్కరించారు. ఎట్టకేలకు సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్సయ్యింది. నవంబర్ 11న మహోత్సవం జరగనుండగా నవంబర్ 15న షూటింగ్ ప్రారంభం కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర - రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు.
`భోళా శంకర్`లో చిరంజీవిని మళ్లీ అభిమానులు మాస్ హీరోగా చూడనున్నాడు. మెహర్ తో చిరు సినిమా చేయడం ఇదే తొలిసారి. కమర్షియల్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన తారాగణం సాంకేతిక సిబ్బంది వివరాల్ని మేకర్స్ వెల్లడించాల్సి ఉంది. భోళా శంకర్ కంటే ముందే బాబితో కూడా సినిమా లాంచ్ ఉంటుందని కూడా కథనాలొచ్చాయి. దానికి సంబంధించిన అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.