Begin typing your search above and press return to search.

నేనెప్పుడూ ఇలాంటి డేరింగ్ పోస్ట‌ర్ చూడ‌లేదు!-వ‌ర్మ‌

By:  Tupaki Desk   |   19 Jun 2022 3:30 AM GMT
నేనెప్పుడూ ఇలాంటి డేరింగ్ పోస్ట‌ర్ చూడ‌లేదు!-వ‌ర్మ‌
X
బోల్డ్ ఫోటోషూట్లు.. బోల్డ్ కామెంట్ల‌తో ప‌బ్లిసిటీ స్టంట్ ని ప‌రాకాష్ట‌కు చేర్చ‌డ‌మెలానో ఆర్జీవీకి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలీదేమో! ఫ్రీ ప‌బ్లిసిటీ స్టంట్ కి ఆయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వెలిగిపోతున్నాడు. ఆర్జీవీ ఏం చెప్పినా ఏం చేసినా ప్ర‌చారం చేసేందుకు ఒక సెక్ష‌న్ మీడియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇటీవ‌ల ఆయ‌న డీ కంపెనీ క‌థానాయిక‌ల‌కు ప్ర‌చారం మ‌రో లెవ‌ల్లో హోరెత్తిపోతోంది.

డ‌ర్టీ పిక్చ‌ర్ కా బాప్ అంటే ఏంటో ఆర్జీవీ చూపిస్తున్నారు. వ‌ల్గ‌ర్ నాస్టీ ఫోటోషూట్ల‌కు కావాల్సినంత ప‌బ్లిసిటీని తెచ్చిపెడుతున్నారు. ఇక ఆర్జీవీ డెన్ నుంచి బోలెడంత ఫ్రీప‌బ్లిసిటీ అందుకుంటోంది అప్స‌రా రాణి. ఈ బ్యూటీ అరేబియ‌న్ స్టైల్ సాల్సా హొయ‌లు ఇప్ప‌టికే యూత్ కి బోలెడంత కిక్కునిస్తున్నాయి.

తాజాగా అప్స‌ర రాణి మ‌రో బోల్డ్ ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్ లో అప్స‌ర ఇన్న‌ర్ అందాలు ఒక రేంజులో మ‌త్తెక్కిస్తున్నాయి. ఏంజెలినా జెన్నిఫ‌ర్ లేడీ గాగా రేంజులో అప్స‌ర ఇచ్చిన ఫోజ్ అగ్గి రాజేస్తోంది.

అప్స‌ర‌లో బోల్డ్ నెస్ కి మురిసిపోయిన ఆర్జీవీ అయితే ఏకంగా ఇలాంటి డేరింగ్ పోస్ట‌ర్ తానెప్పుడూ చూడ‌నేలేద‌ని కాంప్లిమెంట్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ది మోస్ట్ డేరింగ్ పోస్ట‌ర్ ఐ ఎవ్వ‌ర్ సా! అంటూ ట్వీట్ చేసాడు. ఆయ‌న ఫీలింగ్ ఎలా ఉన్నా కానీ ఇది లింగ‌రీ బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ ని త‌ల‌పిస్తోంది అంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఆర్జీవీ మియా మ‌ల్కోవాతో శృంగార ర‌స‌ సినిమా తీసిన ఘ‌నుడు.

అత‌డు చూడ‌ని హాట్ కంటెంట్ ఎక్క‌డ ఉంది? అంటూ అంతా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. చూస్తుంటే ఆర్జీవీ జీఎస్టీ ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)కి సీక్వెల్ తీసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని డీ కంపెనీ క‌థానాయిక‌ల స్వ‌లింగ సంప‌ర్కం కాన్సెప్ట్ కంటే ఇదేమీ బోల్డ్ గా లేద‌ని కూడా కౌంట‌ర్లు వేస్తున్నారు.

ఇక అప్స‌ర రాణి పేరుకు త‌గ్గ‌ట్టే బోల్డ్ లుక్స్ తో తొలి నుంచి యువ‌త‌రానికి గాలం వేస్తోంది. అయినా మెయిన్ స్ట్రీమ్ నాయిక క్వాలిటీస్ త‌న‌లో క‌నిపించ‌లేద‌ని ప్రూవైంది. అప్స‌ర‌ ఒక ఐట‌మ్ రాణిగానే మిగిలిపోయింద‌ని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఓవ‌రాల్ గా ఆర్జీవీ కాంపౌండ్ రాణిగా అప్స‌ర సాధించిందేమీ లేద‌ని విమ‌ర్శ‌ల్ని ఎక్కుపెడుతున్నారు. వ‌రుస బోల్డ్ ఫోటోషూట్ల‌తో అప్స‌ర సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డం వ‌ర‌కూ స‌క్సెస‌వుతోంది.