Begin typing your search above and press return to search.
ఈ ఏడాది హిట్టైన ఒకే ఒక్క రీమేక్ ఇదే..!
By: Tupaki Desk | 23 Nov 2022 3:30 AM GMTపాండమిక్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మరియు ఆలోచనా విధానం పూర్తిగా మారిందనేది అర్థమవుతుంది. ఓటీటీలలో భాషతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ కు అలవాటు పడిపోయిన జనాలు.. ఒరిజినల్ చిత్రాలను చూడటానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన రీమేక్ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్ ని బట్టి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
గత ఏడాది కాలంలో తెలుగు - హిందీ భాషల్లో రీమేక్ అయిన చిత్రాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. వాటిల్లో కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకొని కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు అందుకోలేక బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా నిలిచిపోయాయి. దీంతో ఇకపై ఏ భాషలోనూ రీమేక్స్ పనిచేయవు అనే నిర్థారణకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''దృశ్యం 2'' హిందీ రీమేక్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ''దృశ్యం 2''. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టబు - అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. ఇది మలయాళంలో మోహల్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో అదే టైటిల్ తో తెరకెక్కిన చిత్రానికి అధికారిక రీమేక్. ముందుగా వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేయబడిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలోకి వచ్చేసింది.
గత శుక్రవారం థియేటర్లలోకి రిలీజైన హిందీ 'దృశ్యం 2' చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా సానుకూలంగా వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే నాలుగు రోజుల్లోనే దాదాపు 76 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలుస్తుంది.
నిజానికి గత ఏడాదిగా వచ్చిన రీమేక్ లను పరిశీలిస్తే ''దృశ్యం 2'' ఒక్కటే క్లీన్ హిట్ అనిపించుకునేలా ఉంది. 'అయ్యప్పనమ్ కోశియుమ్' రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోలేకపోయింది. అలానే 'జిగర్తాండా' ('గద్దలకొండ గణేష్') హిందీ రీమేక్ గా అక్షయ్ కుమార్ చేసిన 'బచ్చన్ పాండే' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
షాహిద్ కపూర్ హీరోగా అదే పేరుతో చేసిన తెలుగు రీమేక్ మూవీ 'జెర్సీ' కూడా తీవ్ర నిరాశ పరిచింది. ఇదే క్రమంలో 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి రీమేక్ గా అమీర్ ఖాన్ తీసిన 'లాల్ సింగ్ చద్దా' కూడా ఘోర పరాజయం చవిచూసింది. తమిళ్ లో సూపర్ హిట్టైన 'విక్రమ్ వేదా' సినిమాని హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీఖాన్ లతో హిందీలో రీమేక్ చేయగా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా హిట్ స్టేటస్ అందుకోలేకపోయింది.
ఇటీవల 'లూసిఫర్' రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. మంచి సమీక్షలను పొందింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అలానే 'ఓ మై కడవులే' రీమేక్ గా వచ్చిన 'ఓరి దేవుడా'.. 'ప్రేమ ప్యార్ కాదల్' రీమేక్ గా రూపొందిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన వసూళ్లు అందుకోలేకపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రిలీజైన 'దృశ్యం 2' హిందీ వెర్షన్ రీమేక్ చిత్రాలకు ఊపు తెచ్చింది. దీంతో సరిగ్గా తీస్తే రీమేక్ లు ఇంకా వర్కౌట్ అవుతాయనే చర్చకు దారితీసింది. బలమైన కంటెంట్ ఉండి, ఒరిజినల్ చిత్రాల డబ్బింగ్ వెర్సన్స్ ఓటీటీలలో అందుబాటులో లేనట్లయితే రీమేకులు ఇప్పటికీ పని చేయగలవు. మార్పులు చేర్పులు పేరుతో మాతృక స్క్రిప్ట్ లోని సోల్ ని చెడ గొట్టడం.. ఇమేజ్ పేరుతో భారీ బడ్జెట్ ఖర్చు చేయడం వంటివి చేయకపోతే.. ఇప్పటికీ రీమేక్స్ వర్కౌట్ అవ్వొచ్చు. మరి 'భోళా' 'భోళా శంకర్' 'బుట్టబొమ్మ' లాంటి చిన్న పెద్ద రీమేక్స్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.