Begin typing your search above and press return to search.
RRR టైటిల్ వెనుక అసలు కథ ఇదీ
By: Tupaki Desk | 31 Dec 2021 5:34 AM GMTమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR 2022లో రికార్డుల్ని బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి -జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల కలయికలోని ఈ మూవీ 7 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా వెండితెరపైకి రాబోతోంది. చిత్రబృందం ప్రచారం హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు-హిందీ-తమిళం-మలయాళం-కన్నడలో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేస్తుండడంతో అన్ని మెట్రోల్లో టీమ్ హల్ చల్ చేసింది. ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి RRR గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.
``మేము తొలిగా RRR టైటిల్ ను ప్రకటించినప్పుడు ఇది మంచి విజయాన్ని సాధించింది. అదే క్రమంలో ఆ సందడిని హైప్ ని భారీగా నిర్మించాలనుకున్నాము. అందుకే ఈ టైటిల్ కు కట్టుబడి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాను`` అని రాజమౌళి తెలిపారు. నిజానికి రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ అనే మీనింగ్ లో అభిమానులు RRR టైటిల్ ను రిసీవ్ చేసుకోవడం అంతే వేగంగా యూత్ లో దూసుకుపోవడం తెలిసిందే. ఆ తర్వాత రణం రౌద్రం రుధిరం అంటూ రకరకాలుగా టైటిల్ కి భాస్యం చెప్పింది రాజమౌళి టీమ్.
ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో విడుదల తేదీకి సంబంధించిన రకరకాల రూమర్ ల గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఏ కారణాల వల్ల సినిమా వాయిదా వేసే ప్రసక్తే లేదని క్లారిటీనిచ్చారు. RRR భారతీయ సినీపరిశ్రమలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. రజనీకాంత్ - శంకర్ ల 2.0 తరహాలో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. ట్రేడ్ పరంగా ఈ మూవీపై భారీ బెట్టింగ్ నడుస్తోంది. వాటాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 600కోట్ల నుంచి 1000 కోట్ల వసూళ్ల లక్ష్యంగా ఈ మూవీని బరిలో దించుతున్నారని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. ఆ స్థాయి విజయం సాధిస్తుందా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.