Begin typing your search above and press return to search.
ఎప్పుడొస్తావు కల్కీ ?
By: Tupaki Desk | 6 Jun 2019 5:17 AM GMTయాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కల్కి విడుదల విషయంలో ఇంకా రూట్ క్లియర్ కావడం లేదు. టీజర్ ట్రైలర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మే 31 వస్తుందని ముందు అనుకున్నారు కాని ఏవో సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసి మళ్ళి డేట్ ప్రకటించనే లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కల్కి రావడానికి ఇంకొంత టైం పట్టేలా ఉందట.
ఫైనల్ కాపీ చూసిన ప్రశాంత్ వర్మ నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ దంపతులకు కొన్ని లోపాలతో పాటు సాంకేతికంగా సరిదిద్దాల్సిన ముఖ్యమైన ఎపిసోడ్స్ ఇబ్బందిగా అనిపించాయట. వాటిని సరిదిద్ది పూర్తి సంతృప్తి కలిగాకే అప్పుడు రిలీజ్ గురించి ప్లాన్ చేద్దామని జాయింట్ గా అనుకున్నారట. ఇది అఫీషియల్ గా తెలేలోపు కొంత టైం పడుతుంది కాని కల్కి మంచి సీజన్ ను మిస్ చేసుకున్నట్టే.
బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొన్న స్తబ్దతను క్యాష్ చేసుకోవడానికి ఎంతో కొంత ఛాన్స్ ఉంది ఇప్పుడు. పైగా సమ్మర్ ఎండింగ్ కాబట్టి వసూళ్ళ పరంగానూ ఎక్కువ రాబట్టుకునే అవకాశం మిస్ అయినట్టే. గుంటూరు కృష్ణా జిల్లాలో 1980 ప్రాంతంలో జరిగిన రియల్ క్రైమ్స్ ని ఆధారంగా చేసుకుని రూపొందిన కల్కి స్క్రిప్ట్ మీద ప్రశాంత్ వర్మ ఏడాదికి పైగా వర్క్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వితీయ విఘ్నం రాకుండా ఉండేందుకు రాజీ పడకుండ ఫైనల్ అవుట్ పుట్ మీద ఫోకస్ పెడుతున్నట్టు తెలిసింది. ఏది చేసినా ఆగస్ట్ లో రణరంగం-సాహో-ఎవరు లాంటి థ్రిల్లర్లు యాక్షన్లు క్యు కట్టాయి. సో వస్తే జూలై లేదా ఏకంగా సెప్టెంబర్ దాకా కల్కి దర్శనం ఉండకపోవచ్చు