Begin typing your search above and press return to search.

మహేష్ 26 అంత ఈజీ కాదు బాసూ

By:  Tupaki Desk   |   7 March 2019 10:36 AM GMT
మహేష్ 26 అంత ఈజీ కాదు బాసూ
X
పెద్దలు ఓ సామెత చెబుతారు. ఇల్లు అలగ్గానే పండగ కాదని. దాని వెనుక చాలా తతంగం ఉంటుంది అవన్నీ పూర్తి చేస్తేనే ఆ తంతు ముగిసినట్టని దాని పరమార్థం. ఇది ఎప్పుడో తాతల నాటి నానుడి అయినా ఇప్పుడు కూడా వర్తిస్తుంది. మహర్షి తర్వాత మహేష్ 26గా ప్రచారం లో ఉన్న అనిల్ రావిపూడి సినిమా గురించి అప్పుడే రకరకాల చర్చలు ఊహాగానాలు మొదలైపోయాయి. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు.

ప్రిన్స్ కేవలం లైన్ విని డెవలప్ చేయడానికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే తప్ప ఎలా రాసుకొచ్చినా షూటింగ్ చేద్దామని కాదు. ఇన్నేళ్ల అనుభవం ట్రాక్ రికార్డు ఉన్న సుకుమార్ లాంటి దర్శకుడినే ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పించలేదన్న కారణంతో మరో ఆలోచన లేకుండా నో చెప్పేశాడు. అలాంటిది కేవలం నాలుగు సినిమాల అనుభవం ఉన్న అనిల్ రావిపూడిని గుడ్డిగా నమ్ముతాడు అని అనుకోలేం

ఫైనల్ వెర్షన్ మహేష్ కి పూర్తి సంతృప్తినిస్తేనే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఎఫ్2 టైంలోనే అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ హడావిడిగా రాసుకున్నాడని వెంకటేష్ ఈ విషయంగానే కొంత సీరియస్ అయ్యాడని ఇన్ సైడ్ టాక్ వచ్చింది. సినిమా చూస్తే ఆ ఫీలింగ్ కలగడం సహజం. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఎఫ్2 రెండో సగం చప్పగా అనిపిస్తుంది. ఏదో చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకీ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఇంటర్వెల్ కే పైసా వసూల్ అనిపించడంతో ఈజీగా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచింది. స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే ఏం జరిగేదో.

ఇదంతా మహేష్ టీమ్ కు తెలియదని కాదు. అందుకే అనిల్ రావిపూడి మహర్షి విడుదల తర్వాత మహేష్ హాలిడేస్ పూర్తి చేసుకుని వచ్చే లోపు ఫిదా అయిపోయే రేంజ్ లో నెరేషన్ చెప్పాలి. మరోవైపు ముందు జాగ్రత్తగా మహేష్ ఇంకో ఇద్దరు దర్శకులతో మంతనాలు జరుపుతున్నట్టు టాక్. ప్రతిదీ లీకైపోయి మీడియాలో రచ్చ అవుతున్న కారణంగా ఈ వివరాలు మాత్రం టాప్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. సో అనిల్ కు అసలైన ఛాలెంజ్ ముందుంది