Begin typing your search above and press return to search.

విజయ్ కి ఈసారి అదే మైనస్

By:  Tupaki Desk   |   8 Aug 2019 1:30 AM GMT
విజయ్ కి ఈసారి అదే మైనస్
X
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో భారీ స్టార్డం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి బోల్డ్ అటెంప్ట్ అనిపించుకొని క్లాసిక్ గా నిలిస్తే , గీత గోవిందం ఎవరూ ఊహించని విధంగా 100 కోట్ల సినిమాలల లిస్టులో చేరింది. 'గీత గోవిందం' తర్వాత రిలీజయిన 'టాక్సీ వాలా'పై మేకర్స్ కూడా ఆశలు వదిలేసుకుంటే అది కాస్త సూపర్ హిట్టయి అందరికీ షాక్ ఇచ్చింది.

టాక్సీ వాలా తర్వాత వచ్చిన 'నోటా' డిజాస్టర్ గా నిలిచింది. 'నోటా'తో తమిళ్ లో కూడా మార్కెట్ పెంచుకోవాలని చూసిన విజయ్ ఆశ నిరాశయింది. అందుకే 'డియర్ కామ్రేడ్' తో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని చూసాడు విజయ్. కంటెంట్ ని నమ్ముకొని రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేసాడు. ఆ ప్రమోషన్స్ చూసి విజయ్ కి మళ్ళీ పెద్ద హిట్టే రాబోతుందనుకున్నారంత. అయితే అనుకోకుండా 'డియర్ కామ్రేడ్' ఫ్లాపయింది. తొలి రోజు బాగానే వసూళ్లు చేసినప్పటికీ రెండో రోజే డీలా పడింది.

రిలీజ్ రోజే కంటెంట్ పరంగా పరవాలేదు కానీ లెంగ్త్ మరీ ఎక్కువైందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. లెంగ్త్ వల్ల సినిమా బోర్ కొట్టిందని సోషల్ మీడియాలో ఆడియన్స్ నుండి పోస్టులు పడ్డాయి. మరుసటి రోజు ఓ పదినిమిషాలు ట్రిమ్ చేసినా ఫలితం లేకపోయింది. మొదటి రోజు వచ్చిన టాక్ స్ప్రెడ్ అవ్వడం వల్ల రెండో రోజు కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడింది. నిజానికి అర్జున్ రెడ్డి విషయంలో ఏ మాత్రం అడ్డుకానీ లెంగ్త్ ఈసారి మాత్రం మైనస్ అయింది. అందుకే డియర్ కామ్రేడ్ విషయంలో జరిగిన పొరపాటు నెక్స్ట్ సినిమాకు జరగకుండా కేర్ తీసుకుంటున్నాడట విజయ్.క్రాంతి మాధవ్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి లెంగ్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఇప్పటికే డైరెక్టర్ తో సినిమా లెంగ్త్ గురించి డిస్కర్షన్ కూడా జరిగిందట.