Begin typing your search above and press return to search.
దిల్ రాజు హ్యాండుకున్న సెంటిమెంట్ ఇది
By: Tupaki Desk | 2 May 2022 7:32 AM GMTసినిమా రంగంలో సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తుంటారు. ఇక్కడ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి ప్రతీదీ సెంటిమెంట్ ప్రకారం నడపాల్సిందే. ఎంత పెద్ద స్టార్ అయినా. అప్ కమింగ్ హీరో అయినా.. స్టార్ ప్రొడ్యూసర్ అయినా.. స్టార్ డిస్ట్రి బ్యాటర్ అయినా ఇదే పంధాని పాటిస్తూ వుంటారిక్కడ. అయితే చాలా వరకు సినిమా రిలీజ్ లతో పాటు వాటి ఫలితాలు కూడా సెంటిమెంట్ ని గుర్తుచేస్తుండటం గమనార్హం. అంతే కాకుండా కొంత మంది అడ్వాన్స్ లు కూడా ఇప్పడు సెంటిమెంట్ గా మారడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ గా, టాప్ డిస్ట్రిబ్యూటర్లుగా దిల్ రాజు, శిరీష్‌లకు మంచి పేరుంది. వీరి తీసుకున్న ప్రతీ సినిమా సూపర్ హిట్టు.. బ్లాక్ బస్టర్ హిట్టే. గత కొంత కాలంగా నైజాం ఏరియాలో తిరుగులేని ప్రొడ్యూసర్స్‌గా డిస్ట్రిబ్యటర్లుగా రాణిస్తున్నారు. వరుస భారీ చిత్రాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీరొకరికి అడ్వాన్స్ ఇస్తే ఇక కంటిన్యూ చేయాల్సిందేనంట. అలా కాకుండా అడ్వాన్స్ తిరిగిచ్చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయడం ఖాయం అని ఓ సెంటిమెంట్ వుందని స్వయంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ చెప్పడం విశేషం.
ఈ విషయాన్ని మృగరాజు నుంచి ఆచార్య` వరకు అనేక సినిమాలు రుజువు చేశాయని చెప్పడం ఆసక్తికరంగా మారింది. నైజాంలో గత కొన్నేళ్లుగా ఏ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ముందు వినిపించే పేరు వీరిదే. అయితే ఈ మధ్య వీరికి పోటీ మొదలైంది. వీరు ఏ భారీ సినిమాని రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎదురుగా వెళ్లి వాళ్ల కంటే ఎక్కువ మొత్తం కోట్ చేస్తున్నారు వరంగల్ శ్రీను. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ చిత్రం `ఆచార్య`.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఈ సినిమా తీవ్రంగా నిరుత్సాహపరిచింది. అయితే ఈ మూవీని నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం దిల్ రాజు 30 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. అయితే అంతకు మించి ఇస్తానంటూ పోటీకి దిగిన వరంగల్ శ్రీను ఈ చిత్ర నైజాం హక్కుల కోసం ఏకంగా 42 కోట్లు కోట్ చేసి సొంతం చేసుకున్నారు.
ఇందులో 36 కోట్లు నాన్ రిఫండబుల్ అమౌంట్. దిల్ రాజుపై రివేంజ్ తీర్చుకోవడానికి మాత్రమే ఈ సినిమాకు పోటీపడి మరీ 42 కోట్లు కోట్ చేసి నైజాం హక్కుల్ని సొంతం చేసుకున్నాడు వరంగల్ శ్రీను. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన `ఆచార్య` అనూహ్యంగా చేదు ఫలితాన్ని అందించి ఒక్కసారిగా షాకిచ్చింది.
దీంతో రివేంజ్ ఏమో కానీ వరంగల్ శ్రీను ఈ దెబ్బతో 50 శాతం నష్టాలని ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రివేంజ్ కోసం తొందరపడి వరంగల్ శ్రీను బుక్కయ్యాడని, లక్కీగా దిల్ రాజు సేవ్ అయ్యాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దీంతో చాలా మంది `ఆచార్య` ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు హ్యాండ్ అంటే అంతే మరి అంటూ కామెంట్ లు చేస్తున్నారట.