Begin typing your search above and press return to search.

ఏపీలో సినిమాల ప‌రిస్థితి ఇది!

By:  Tupaki Desk   |   29 July 2022 2:58 PM GMT
ఏపీలో సినిమాల ప‌రిస్థితి ఇది!
X
ఒక‌టి కొంటే ఒక‌టి ఫ్రీ అని చాలా షాపుల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో చూస్తుంటాం. కానీ సినిమా థియేట‌ర్ల‌లోనూ ఈ త‌ర‌హా బోర్డ్ లు క‌నిపించ‌డం షాకిస్తోంది. ఒక టికెట్ కొంటే మ‌రో టికెట్ ఫ్రీ అంటూ ఏపీ లోని కొన్ని థియేట‌ర్ల ముందు బోర్డ్ లు వెలుస్తున్నాయి. దీంతో అక్క‌డ తెలుగు సినిమాకు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా తెలుగు సినిమా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. క‌రోనా కార‌ణంగా షూటింగ్ లు ఆగిపోవ‌డం.. వేసిన సెట్ లే మ‌ళ్లీ వేయ‌డం, ఆర్టిస్ట్ ల కాల్షీట్ లు పెరిగిపోవ‌డం వంటి కార‌ణాల‌తో ఆర్థిక భారం పెరిగి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి.

దీనిక‌తోడు షూటింగ్ డేస్ పెర‌గ‌డం, ఓటీటీ ప్ర‌భావం, టికెట్ రేట్లు పెర‌గ‌డంతో ప్రేక్ష‌కులు ఆ భారీ మొత్తాల‌ని వెచ్చించ‌లేక థియేట‌ర్ల‌కు ముఖం చాటేస్తున్నారు. దీంతో థియేట‌ర్ల వారికి నిర్వాహ‌ణ భారంగా మారుతూ వ‌స్తోంది. దీంతో ఒక‌ట టికెట్ కొంటే మ‌రో టికెట్ ఫ్రీ అంటూ ఏపీలోని సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల వ‌ద్ద బోర్డ్ లు వెలుస్తున్నాయి. ఈ ప‌రిస్థితి ప్ర‌ధానంగా బి,సీ సెంట‌ర్ల‌లో క‌నిపిస్తుండం విచార‌క‌రం.

రీసెంట్ గా విడుద‌లైన ప‌లు సినిమాల‌కు ఏపీలోని బి, సి సెంట‌ర్ల‌లో సినిమాలు చూడ‌టానికి జ‌నాలు క‌రువ‌య్యారు. పేరున్న హీరో సినిమా అయినా కూడా ఎవ‌రూ థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డంతో థియేట‌ర్ల యాజ‌మాన్యం థియేట‌ర్ల వ‌ద్ద టికెట్ డిస్కౌంట్ బోర్డ్ లు పెడుతున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు లోని థియేట‌ర్ ముందు ఒక‌టి టికెట్ కొంటే మ‌రొక‌టి ఫ్రీ అని బోర్డులు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇలా టికెట్ ల‌కు డిస్కౌంట్ బోర్డ్ లు పెట్టినా మూడు రోజుల్లో థియేట‌ర్ కు వ‌చ్చింది కేవ‌లం ఆరుగురే ప్రేక్ష‌కుల‌ట‌. తాజా సంఘ‌ట‌న ఏపీలో సినామ థియేట‌ర్ల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయ స్థితికి చేరింద‌ని స్ప‌ష్టం చేస్తోంది. టికెట్ రేట్లు ఇష్టాను సారం పెంచ‌డం, ఓటీటీ ప్ర‌భావం ప‌తాక స్థాయికి చేర‌డం వ‌ల్లే సినిమా థియేట‌ర్ల‌కు ఈ దుస్థితి ప‌ట్టింద‌ని ప‌లువురు ట్రేడ్ వ‌ర్గాలు వాపోతున్నాయి.

ఇద్ద‌రు వ్య‌క్తులు 70 రూపాయ‌ల‌తో సినిమా చూడ‌వ‌చ్చ‌ని థియేట‌ర్ల వారు ఆఫ‌ర్లు ఇచ్చినా జ‌నం ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డంతో ఏపీలో సినిమాల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వాపోతున్నాయి.