Begin typing your search above and press return to search.
#RRR కథ ఇదేనా? రామ్ వర్సెస్ భీమ్ ఫ్యాన్స్ డివైడ్!
By: Tupaki Desk | 24 Nov 2020 4:50 PM GMTకథలో కాన్ ఫ్లిక్ట్ ని బట్టే గ్రాఫ్ పెరుగుతుంది. అసలు ఏదీ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతే అందులో కిక్కేమీ ఉండదు. ఈ విషయంలో రాజమౌళి- విజయేంద్ర ప్రసాద్ జోడీ ఎంతో ఆచితూచి అడుగేస్తారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కథ విషయంలో కూడా అంతే గొప్ప ఎత్తుగడల్ని అనుసరించారు ఈ మేధావులు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా చరణ్ .. తారక్ అభిమానులు సోషల్ మీడియాల్లో ఆర్.ఆర్.ఆర్ కథ గురించి రకరకాల ఊహాగానాలపై డిబేట్ రన్ చేస్తున్నారు. ఇది నిజమా కాదా? అన్నది అటుంచితే ఈ డిబేట్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ కథాంశంలో రామ్ వర్సెస్ భీమ్ ఎపిసోడ్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తూనే ఆ ఇద్దరూ కలిసే సన్నివేశంతో సినిమా గ్రాఫ్ ని అమాంతం పెంచేస్తారట. బ్రిటీష్ వాళ్ల తరపున పోలీస్ అధికారిగా విధ్యాధికుడు అయిన సీతారామరాజు పని చేస్తుంటారు. ఒకానొక సందర్భంలో మాస్ లీడర్ అయిన గిరిజన నాయకుడు భీమ్ ని అరెస్ట్ చేస్తాడట. ఆ తర్వాత బ్రిటీషర్లపై ఎదురు తిరిగే క్రమంలో ఓ సీన్ లో ఆ ఇద్దరూ కలిసిపోతారు. అప్పటివరకూ ఆ ఇద్దరి మధ్యా పోరు సాగుతుంది.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చే క్రమంలో ఆ ఇద్దరూ కలుస్తారు. ఇక గిరిజన తండా నుంచి భీమ్ ఎంతో మాసీ ఫైట్స్ తో కట్టిపడేస్తాడట. అతడు ఆంగ్లేయుల్ని గొరిల్లా దాడుల రూపంలో ఏరేస్తుంటాడు. మొత్తానికి అల్లూరి సీతారామరాజు పాత్రను.. కొమరం భీమ్ పాత్రను ఎంతో ఉద్వేగాలతో డిజైన్ చేశారని అర్థమవుతోంది. అలాగే భీమ్ పాత్ర పులితో పోరాటంపైనా ఆసక్తికర అప్ డేట్ అందింది ఇంతకుముందు.
అయితే చాలా ముందే ఇలా కథ తెలిసిపోవడంపై మెగా నందమూరి అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంటర్వెల్ సహా పతాక సన్నివేశాల్ని కూడా అంతర్జాలంలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇది నెటిజనులు ఊహించి రాసినది కొంత అయితే ఇంచుమించు ఇప్పటికే లీకైన ఫోటోలు పోస్టర్ల ఆధారంగా కూడా ఈ కథను ఊహించుకుంటున్నారని అర్థమవుతోంది. ఇక హీరోల అభిమానుల్లో ఈ కథాంశంపై డివైడ్ టాక్ ఉంది. ఒకరు అవును ఇదే అసలు కథ అని వాదిస్తుంటే.. ఒరిజినల్ కథ వేరే ఉందని కొందరు వాదిస్తున్నారు.