Begin typing your search above and press return to search.
సురేష్ గీతల స్ట్రాటజీ అదేనా ?
By: Tupaki Desk | 7 Jun 2019 6:11 AM GMTఒకప్పుడు టాలీవుడ్ లోనే అతి పెద్ద బ్యానర్లుగా నిలిచిన సురేష్ ప్రొడక్షన్స్ గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు ఇటీవలి కాలంలో సినిమాల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అప్పటి తరహలో కేవలం కాంబినేషన్ల ఆధారంగా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడటం లేదు. అందులోనూ ముఖ్యంగా సురేష్ బాబు ఇటీవలి కాలంలో ఎక్కువగా చిన్న సినిమాలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తాను ప్రొడ్యూస్ చేసే బదులు ఆల్రెడీ పూర్తైపోయి లేదా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలకు చేయూత నిచ్చి తన బ్యానర్ పేరుని జోడించి తద్వారా వాటికీ మంచి రిలీజ్ వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వచ్చేసిన ఫలక్ నుమా దాస్ ఎబిసిడి లాంటి సినిమాలతో మొదలుకుని రానున్న ఓ బేబీ-దొరసాని లాంటి మీడియం రేంజ్ మూవీస్ అన్ని ఆయనే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
మరోవైపు కేవలం బడ్జెట్ సినిమాల కోసమే గీత ఆర్ట్స్ 2 అంటూ మరో బ్యానర్ తో నిర్మాణం కొనసాగిస్తున్న అల్లు అరవింద్ ఇంత దూకుడుగా లేకపోయనా అటు ఇటుగా ఇదే తరహా స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. అయితే ముందుగానే డైరెక్టర్లను లాక్ చేసుకోవడం ఈయన శైలి. ఈ కారణంగానే గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా పరశురాం ఏడాది పాటు ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొత్తది ఖరారు కానే లేదు. ఇలాంటి బడా సంస్థలు అవలంబిస్తున్న శైలి ప్రోత్సాహకరంగా ఉన్నా కొత్త నిర్మాతల మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఆలోచించాల్సిన విషయమే.
వీళ్ళలో ఎవరు ఒకరు కొంటారులే అని గుడ్డిగా సినిమాలు తీయడానికి లేదు. కంటెంట్ నచ్చితేనే వాళ్లైనా చేయూతనిచ్చేది. కాబట్టి కంటెంట్ లో క్వాలిటీ ఉంటె విడుదలకు ఇబ్బందులు పడుతున్న దర్శక నిర్మాతలకు సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఒకవేళ అనూహ్యమైన ఫలితాలు వస్తే వాటి పూర్తి ఫలాలు దక్కినా దక్కపోయినా ఇంకో సినిమా తీయాడానికి ఈ కొత్త నిర్మాతలకు ధైర్యం వస్తుంది. గీత సురేష్ లాంటి పెద్ద సంస్థలే రిస్క్ తగ్గించుకోవడం కోసం ఇతర నిర్మాతలతో టై అప్ అవుతుంటే ఇక కొత్త ప్రొడ్యూసర్ల గురించి చెప్పేదేముంది