Begin typing your search above and press return to search.
కరోనా తర్వాత వరల్డ్ బెస్ట్ ఓపెనర్ ఇదే
By: Tupaki Desk | 7 Jun 2022 4:24 AM GMTకరోనా క్రైసిస్ కల్లోలం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హాలీవుడ్ కి ఈ సీజన్ అశనిపాతమే అయ్యింది. అయితే ప్రపంచం నెమ్మదిగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న జురాసిక్ వరల్డ్ డొమినియన్ అంతర్జాతీయంగా 26 మిలియన్ డాలర్లతో బాక్సాఫీస్ ను ప్రారంభించడం ఉత్సాహం నింపుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్ లతో క్రైసిస్ తర్వాత ఈ మూవీ బెస్ట్ ఓపెనర్ గా నిలుస్తోందని ట్రేడ్ చెబుతోంది.
జురాసిక్ వరల్డ్ డొమినియన్..కి ప్రజల్లో అసాధారణ క్రేజు నెలకొంది. జురాసిక్ వరల్డ్ సిరీస్ ముగింపు ఈ పార్ట్ 3 మూవీ. అందువల్ల భారీ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ దిశగా దూసుకుపోతోందని కథనాలొస్తున్నాయి. థియేట్రికల్ గా మళ్లీ ఉత్సాహం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జురాసిక్ వరల్డ్ డొమినియన్ 2022 జూన్ 10న విడుదలవుతోంది.
జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఇప్పటికే విడుదలైన కొన్ని అంతర్జాతీయ మార్కెట్ లలో గొప్ప ప్రారంభాన్ని ప్రదర్శించింది. ఇది ఇప్పటివరకు 25.9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది భారతదేశం సహా ప్రపంచంలోని ఇతర దేశాలలో విడుదలవుతోంది దేశీయ మార్కెట్ ఉత్తర అమెరికాలో ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తోందని సమాచారం.
కరోనా అనంతరం జురాసిక్ వరల్డ్ డొమినియన్ భారీ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ లు సాధిస్తోందని టాక్ వినిపిస్తోంది. విశ్లేషకుల ప్రకారం... థియేట్రికల్ గా కోలుకుంటున్న ఈ సంవత్సరం ది బ్యాట్‌మ్యాన్ - డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ - టాప్ గన్: మావెరిక్ వంటి సినిమాలు స్టూడియోలకు చాలా లాభదాయక ఫలితాలను అందించాయి. జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్-విజయం సాధించనుందని విశ్లేషిస్తున్నారు. మొదటి సినిమా జురాసిక్ వరల్డ్ 1.67 బిలియన్ డాలర్లు వసూలు చేయగా.. సీక్వెల్ అయిన ఫాలెన్ కింగ్డమ్ 1.30 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. మూడోభాగం 2 బిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా ఆశిస్తున్నారు.
జురాసిక్ వరల్డ్ డొమినియన్ అనేది జురాసిక్ వరల్డ్ సిరీస్ ముగింపు. గత చిత్రంలో డైనోసార్ లు ప్రపంచంలోకి పారిపోయాయి. క్రిస్ ప్రాట్ - బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ఓవెన్ గ్రేడీ - క్లైర్ డియరింగ్ ప్రధాన పాత్రలతో ఇది తిరిగి వస్తోంది. అసలైన జురాసిక్ పార్క్ నుండి వచ్చిన ముగ్గురు లారా డెర్న్- సామ్ నీల్- జెఫ్ గోల్డ్ బ్లమ్ లతో పార్ట్ 3కి వినోదాన్ని జోడించారు. 1993 స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రం తర్వాత వారు మళ్లీ మొదటిసారి కలిసి తెరపై కనిపిస్తున్నారు. నీల్ డెర్న్ - గోల్డ్ బ్లమ్ జురాసిక్ పార్క్ లో వరుసగా పాలియోంటాలజిస్ట్ డాక్టర్ అలాన్ గ్రాంట్.. పాలియోబోటానిస్ట్ డాక్టర్ ఎల్లీ సాట్లర్ .. గణిత శాస్త్రజ్ఞుడు కం గందరగోళ సిద్ధాంతకర్త ఇయాన్ మాల్కం పాత్రను పోషించారు. BD వాంగ్ కూడా ఒరిజినల్ సినిమా నుండి డాక్టర్ హెన్రీ వూగా తిరిగి తెరపై కనిపిస్తాడు.
పార్ట్ 3 ట్రైలర్లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. మూడో ట్రైలర్ దూసుకెళుతోంది. జురాసిక్ వరల్డ్3 చిత్రంలో డానియెల్లా పినెడా- ఇసాబెల్లా సెర్మన్- జస్టిస్ స్మిత్ - ఒమర్ సై తదితరులు కూడా నటించారు. జురాసిక్ వరల్డ్ డొమినియన్ 10 జూన్ 2022న విడుదల అవుతోంది. తాజాగా విడుదలైన మూడవ ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచింది.