Begin typing your search above and press return to search.
మాస్ రాజాను ఇబ్బంది పెడుతున్న 2020!
By: Tupaki Desk | 8 May 2020 8:30 AM GMTలైఫ్ ఎవ్వరినీ వదలదు.. అందరి దూల తీర్చేస్తది.. అనే 'టెంపర్' సినిమాలోని డైలాగ్ ఇప్పుడు 2020 ఏడాదికి పూర్తిగా వర్తిస్తుంది. సహజంగా జనాల అభిప్రాయం ఎలా ఉంటుందంటే "ధనిక దేశాలు.. అభివృద్ధి చెందినా దేశాలు సేఫ్.. మిగతావి కాదు. ధనికులు సేఫ్ మిగతావారు కాదు." మంచో చెడో కానీ కరోనా వైరస్ ఆ అభిప్రాయాన్ని సమూలంగా మార్చేసింది. అమెరికా లాంటి సో కాల్డ్ నెంబర్ వన్ దేశాన్ని ఎలా వణికిస్తోందో... పేద దేశాలను కూడా అలానే వణికిస్తోంది. ప్రైమ్ మినిస్టర్.. పేదవాడు అనే తేడాలేకుండా తగులుకుంటూ దూల తీర్చేస్తోంది. ఇలాంటి దూల దీర్చే సంవత్సరాన్ని ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు. మనమే కాదు మాస్ మహారాజా రవితేజ కూడా ఇష్టపడడం లేదట.
తనకే కాదు మానవాళి మొత్తానికి ఈ ఏడాది చాలా చేటు చేసిందని రవితేజ అంటున్నారట. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'డిస్కోరాజా' పై రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. అయితే ఆ సినిమా ఫ్లాప్ గా నిలవడం నిరాశపరిచిందట. అదొక్కటే కాకుండా తన అప్కమింగ్ సినిమా 'క్రాక్' పై నెగెటివ్ వార్తలు వస్తూ ఉండడంతో అయన అప్సెట్ అయ్యారట. వీటికి తోడు ఇప్పుడు ఈ కరోనా రావడంతో షూటింగులు లేకుండాపోవడం రవితేజకు నచ్చడం లేదట. కెరీర్లో ఎప్పుడూ ఖాళీగా లేని రవి తేజ మొదటి సారి ఇంట్లోనే ఉండి పోవడం నచ్చలేదని తన సన్నిహితులతో చెప్పారట.
అయితే ఎలా ఉన్నప్పటికీ ఈ లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడుపుతున్నారట. లాక్ డౌన్ విరమణ ప్రకటించిన తర్వాత పరిస్థితులు సాధారణంగా మారేవరకూ అందరికీ ఇబ్బంది తప్పేలా లేదు.