Begin typing your search above and press return to search.

విడాకుల పుకార్లకు యంగ్‌ హీరో సమాధానం ఇదే

By:  Tupaki Desk   |   18 Nov 2022 6:07 AM GMT
విడాకుల పుకార్లకు యంగ్‌ హీరో సమాధానం ఇదే
X
యంగ్‌ హీరో నిఖిల్‌ కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన 18 పేజెస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. వరుసగా భారీ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్న నిఖిల్‌ వ్యక్తిగత విషయం గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.

నిఖిల్‌ తన భార్య పల్లవి వర్మ తో దూరంగా ఉంటున్నాడని... ఆమెతో విభేదాల కారణంగా విడాకుల వరకు వెళ్లింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు ఎంతగా వారించినా.. ఒప్పించే ప్రయత్నిం చేసినా కూడా నిఖిల్‌ మరియు పల్లవి వర్మ లు మళ్లీ కలిసి ఉండేందుకు అంగీకరించలేదు అంటూ ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియాలో వచ్చిన వార్తలకు ఆ మధ్య ఒక టాక్ షో లోనే క్లారిటీ ఇచ్చాడు. పల్లవితో అంతా బాగానే ఉందని పేర్కొన్నాడు. ఆమెతో తాను చక్కని జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. తాజాగా మరోసారి ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

ఈ ఫోటోను షేర్‌ చేసి నువ్వు పక్కన ఉన్న ప్రతిసారి కూడా అద్భుతం అన్నట్లుగా భార్య పేరును ట్యాగ్‌ చేశాడు. వీరిద్దరి కొత్త ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీరిద్దరు కలిసి ఉన్నారు.. విడాకుల వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.