Begin typing your search above and press return to search.

ఇది మరీ టూమచ్ గా ఉంది లెజెండ్..!

By:  Tupaki Desk   |   23 July 2022 10:30 AM GMT
ఇది మరీ టూమచ్ గా ఉంది లెజెండ్..!
X
లెజెండ్ శరవణన్ అని పిలువబడే తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త శరవణన్ అరుల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. శరవణన్ స్టోర్స్ కు ఎవరో ఒక స్టార్ ని బ్రాండ్ ప్రచారకర్తగా పెట్టుకోకుండా.. తనే స్వయంగా వ్యాపార ప్రకటనల్లో నటించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ''ది లెజెండ్‌'' అనే చిత్తంతో వెండితెరపై సందడి చేయడానికి వస్తున్నాడు.

న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో శరవణన్ స్వీయ నిర్మాణంలో ''ది లెజెండ్'' చిత్రాన్ని రూపొందించారు. దీనికి జీడీ-జెర్రీ దర్శకత్వం వహించారు. అగ్ర హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం పాపులర్ స్టార్స్ మరియు టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు.

'ది లెజెండ్' చిత్రాన్ని జూలై 28న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2500 పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. స్టార్ హీరో రేంజ్ లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా అదే విధంగా చేస్తున్నారు.

ట్విట్టర్ - ఫేస్ బుక్ - ఇన్స్టాగ్రామ్ లలో లెజెండ్ శరవణన్ ఖాతాలు ఓపెన్ చేయడం కూడా ఒక విశేషంగా ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. 'వెల్కమ్ తలైవార్' అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో నానా హడావుడి చేస్తున్నారు. లెజెండ్ ఎంట్రీతో సోషల్ మీడియాకే సరికొత్త వైభవాన్ని తీసుకొచ్చినట్లుగా ఊదర గొట్టడమే మరీ కామెడీగా ఉంది.

ఇక సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టిన వెంటనే ప్రచారం మొదలుపెట్టారు. ఫస్ట్ పోస్ట్ గా సినిమాలోని లెజెండ్ సర్వవేడి అనే పాటని రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన 'ది లెజెండ్' ప్రమోషనల్ కంటెంట్ పై ట్రోలింగ్ జరిగినప్పటికీ.. యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి.

ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన సాంగ్ లో లెజెండ్ ను ఒక వీరుడిగా ప్రెజెంట్ చేశారు. స్టైలిష్ యాక్షన్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిర్మాత కూడా తనే కావడం శరవణన్ ఈ సినిమా కోసం డబ్బును నీళ్ళలా ఖర్చు చేశారని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.

స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించే హరీష్ జయరాజ్.. అందుకు ఏమాత్రం తగ్గకుండా లెజండ్ కు అద్భుతమైన ఆర్ ఆర్ కంపోజ్ చేశారు. వేల్ రాజా సినిమాటోగ్రఫీ బాగుంది. ఇకపోతే ఈ సినిమాలో శరవణన్ సరసన అందాల భామ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించింది. సుమన్ - ప్రభు - నాజర్ - విజయ్ కుమార్ - వివేక్ - గీతిక - లత - కోవైసరళ - యోగిబాబు తదితరులు కీలక పాత్రలో నటించారు.

హీరోయిన్ - మ్యూజిక్ - మేకింగ్ క్వాలిటీ - విజువల్స్. ఇలా అన్ని అంశాలు చాలా కాస్ట్లీ గానే ఉన్నాయి. మన లెజెండ్ డెబ్యూ సినిమాకే బలమైన కథని ఎంచుకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని లెజెండ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు అర్థం అవుతోంది. ఎన్ని చేసినా ఎంత ఖర్చు పెట్టినా శరవణన్ పై ట్రోలింగ్ మాత్రం అలానే ఉంది. మరి జనాలు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.