Begin typing your search above and press return to search.

ఈ మైఖెల్ కాస్త రొమాంటిక్ గురూ!

By:  Tupaki Desk   |   26 Dec 2022 5:16 AM GMT
ఈ మైఖెల్ కాస్త రొమాంటిక్ గురూ!
X
యంగ్ హీరో సందీప్ కిష‌న్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు..త‌మిళ్ రెండు భాష‌ల్లోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. స‌క్సెస్..ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఏకైక హీరోగా సందీప్ ని చెప్పొచ్చు. కెరీర్ మొద‌ట్లో ఎంత వేగం చూపించాడో? ఇప్పుడు అంత‌కు మించి వేగాన్ని అందుకున్న‌ట్లు యంగ్ హీరో జోరు చూస్తేనే తెలుస్తోంది.

ప్ర‌స్తుతం సందీప్ ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమాతో కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ఏడాదంతా ప్రాజెక్ట్ లు సెట్ చేసుకుని ..అవ‌స‌ర‌మైన వాటిని సెట్స్ కి తీసుకెళ్లి రిలీజ్ ప్లాన్ చేసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. వాటిలో ఒక‌టి 'మైఖెల్'. ఇది సందీప్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ . దీంతో చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు.

ఇందులో సందీప్ కి జోడీగా దివ్యాంశ కౌశిక్ న‌టిస్తోంది. ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఫస్ట్ సింగిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. 'నువ్వుంటే చాలు' అనే పాటని డిసెంబర్ 28న తెలుగు- తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఇది రొమాంటిక్ మెలోడీగా కనిపిస్తుంది. ప్రధాన జంట సందీప్ కిషన్ - దివ్యాంశ కౌశిక్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీని పాట‌లో హైలైట్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ అదే విష‌యాన్ని రివీల్ చేస్తోంది.

ఇద్ద‌రి మ‌ధ్య ఓ రొమాంటిక్ స‌న్నివేశాన్ని హైలైట్ చేస్తూ పోస్ట‌ర్ ని లాంచ్ చేసారు. ఇద్ద‌రి రొమాంటిక్ మోడ్ లో ప్ర‌పంచాన్నే మైమ‌రిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి లిరిక‌ల్ సాంగ్ లో ఎలాంటి మూవ్ మెంట్స్ ఉంటాయ‌న్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మ‌లుస్తున్నారు. అన్నిప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్- కరణ్ సి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నా యి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో క‌నిపించ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.