Begin typing your search above and press return to search.
మహేష్ 26లో ఉన్న రిస్క్ అదే
By: Tupaki Desk | 20 April 2019 8:37 AM GMTసూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్న మహర్షి విడుదల కాగానే కొంత గ్యాప్ తీసుకుని ప్రిన్స్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు తీయబోయే మూవీలో జాయిన్ అవుతాడు. ఫైనల్ నేరేషన్ ఇంకా విననప్పటికి బేసిక్ లైన్ బాగా నచ్చడంతో దానికి తగ్గట్టే ఫుల్ స్క్రిప్ట్ ని అనిల్ రావిపూడి రెడీ చేస్తాడన్న గ్యారెంటీ దిల్ రాజు ఇవ్వడంతో మహేష్ ఎక్కువ ఆలోచించలేదని టాక్.
ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి ఇప్పటిదాకా తీసిన నాలుగు సినిమాల్లో మహేష్ రేంజ్ స్టార్ హీరోను డీల్ చేయలేదు. వెంకటేష్-రవితేజలు వ్యక్తిగతంగా స్టార్లే అయినప్పటికీ వాళ్ళకు వంద కోట్ల మార్కెట్ లేదు. కాబట్టి సబ్జెక్టు పరంగా రిస్క్ తీసుకునే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాని మహేష్ సినిమాలో చాలా కమర్షియల్ లెక్కలు ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఏ మాత్రం బాలన్స్ తప్పినా అంతే సంగతులు
అనిల్ రావిపూడి మహేష్ సినిమాకు వర్క్ చేయడం ఇదే మొదటి సారి కాదు. ఆగడులో ఇతని హ్యాండే ఉంది. కాని తాము అనుకున్నట్టు ఆగడు తెరకెక్కలేదని ఒకవేళ ముందు రాసుకున్న తరహలో ప్లాన్ చేసుంటే మరో దూకుడు అయ్యేదని ఆ మధ్య అనిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఎలాంటి పరిమితులు అడ్డంకులు లేవు. పూర్తి స్వేచ్చ ఉంది.
తాను చెప్పిన మాటలను రుజువు చేయాల్సిన బాద్యత ఉంది. సో అనిల్ రావిపూడి ఇది ఎలా నేరవేరుస్తాడనేది అంత ఈజీ కాదు. పైగా సగం స్క్రిప్ట్ తోనే సెట్స్ పైకి వెళ్లిపోతాడని అనిల్ మీద ఓ రూమర్ ఉంది. మళ్ళి ఇలాంటి కామెంట్ రాకుండా పక్కా ప్లాన్ తో డీల్ చేస్తేనే మహేష్ 26 అంచనాలు అందుకోవచ్చు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోయే ఈ మూవీ షూటింగ్ జూన్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి