Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: RC15 కి మోకాలడ్డే రూల్ తెచ్చారా?
By: Tupaki Desk | 24 July 2021 3:30 AM GMT``ప్రస్తుతం క్రైసిస్ వల్ల షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు మొదట పూర్తి చేయాలి. ఈ సినిమాలు విడుదలయ్యే వరకు ఏ హీరో లేదా హీరోయిన్ కొత్త సినిమా ప్రారంభించకూడదు`` .. ఇదీ నిర్మాతల మండలి తాజా ప్రతిపాదన. అయితే ఇది కొత్తగా ఠెంకాయ కార్యక్రమంతో ప్రారంభించాలని భావిస్తున్న సినిమాలకు చెక్ పెట్టే నిర్ణయం. దీనివల్ల చాలా క్రేజీ సినిమాలను వెంటనే ప్రారంభించే అవకాశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్లపై నియంత్రణ వల్ల దూకుడు సాధ్యపడదు.
దీని ప్రభావం శంకర్ తో రామ్ చరణ్ సినిమా లాంచింగ్ పైనా పడనుంది. నిజానికి శంకర్ ఇప్పటికే భారతీయుడు 2 ని పూర్తి చేయాలని లైకా సంస్థ ఇతర ప్రాజెక్టులు ప్రారంభం కాకుండా మోకాలడ్డుతోంది. కోర్టుల పరిధిలో తీర్పు శంకర్ కి అనుకూలంగా వచ్చినా లైకా తనకు ఉన్న ఇతర మార్గాల ద్వారా ఆర్సీ 15 ని ఆ చిత్రాన్ని నిర్మించే దిల్ రాజును.. అలాగే శంకర్ చేయాల్సిన ఇతర సినిమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారతీయుడు 2 పూర్తయ్యే వరకూ వేరే ఏ ప్రాజెక్టును చేపట్టకూడదనేది శంకర్ పై ఒత్తిడి పెంచుతోంది.
ఇలాంటి సమయంలో తెలుగు నిర్మాతల మండలి స్టార్లను నియంత్రిస్తూ తెచ్చిన కొత్త ప్రతిపాదన లైకాకు పెద్ద సాయంగా మారిందని తెలుస్తోంది. ఆర్సీ 15 ప్రారంభించేందుకు ఈ రూల్ అడ్డంకిగా మారింది. అయితే చరణ్ - శంకర్ బృందం దీనిని సాధ్యమైనంత వరకూ స్నేహ పూర్వకంగా పరిష్కరించుకుని ముందుకెళ్లేందుకు ఆస్కారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు రామ్ చరణ్ ఆర్సీ 15 చిత్ర నిర్మాత దిల్ రాజుపై ఇప్పుడు లైకా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ సన్నివేశంలో సమస్యకు పరిష్కారం ఏమిటి? అన్ని వేచి చూడాలి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా ఈ వివాదానికి స్నేహపూర్వక పరిష్కారం కోరుతోందని తెలిసింది. మరి అంతా కూచుని మాట్లాడుకుంటారా.. మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్! అంటారా..! చూడాలి.